A place where you need to follow for what happening in world cup

నారాయణ కాలేజీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్

Food poisoning in Narayana College Hostel

  • 250 మంది విద్యార్థినులకు అస్వస్థత
  • హాస్టల్ నిర్వహకులపై చర్యలు
  • తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్

నారాయణ జూనియర్ కాలేజీ హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ అయ్యింది. మల్లంపేట ఔటర్ రింగ్ రోడ్డు బ్రాంచ్ బాలికల క్యాంపస్ లో ఫుడ్ పాయింజన్ కారణంగా 250 మంది విద్యార్ధినులు అస్వస్థతకు గురై వాంతులు విరేచనాలతో తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈ నేపథ్యంలో ఫుడ్ పాయిజన్ తో అస్వస్థతకు గురైన 200 మంది విద్యార్థినిలను కాలేజీ యాజమాన్యం ఇంటికి పంపించివేసింది.

సుమారు 2వేల మంది విద్యార్ధినిలు ఈ కాలేజీ క్యాంపస్ లో ఉన్నారు. కాలం చెల్లిన పదార్ధాలతో ఆహారాన్ని వండుతున్నారని, మంచినీరు కూడా శుభ్రంగా ఉండటం లేదని , ఆహార విషయంలో కానీ, వంటశాల శుభ్రత విషయంలో కనీస నాణ్యత పాటించడం లేదని విద్యార్ధినులు ఆరోపిస్తున్నారు. మరోపక్క లక్షలాది రూపాయలను ఫీజుగా వసూలు చేసి తమ పిల్లల ఆరోగ్యాన్ని గాలికొదిలేస్తున్నారని విద్యార్థినుల తల్లిదండ్రులు ఆరోపించారు. కాలేజీ , హాస్టల్ నిర్వహకులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.