ధర్మపురి నియోజకవర్గంలో గొల్లపల్లి మండలం తిరుమలపురం(పి.డి) రెవెన్యూ పరిధిలోని రంగదాముని పల్లె చిన చెరువు ను పరిశీలించిన ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్,ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గత కొన్ని సంవత్సరాలుగా గొల్లపెల్లి,వెల్గటూర్, పెగడపెల్లి మండలాలకు చెందిన రైతాంగం రంగదాముని పల్లె మినీ చెరువుపై ఆధారపడి పంటలు సాగు చేసుకోవడం జరుగుతుందని.
ఇక్కడి ప్రాంత రైతాంగానికి సాగు నీటి విషయంలో తాగు నీటి విషయంలో శాశ్వత పరిష్కారం చూపాలని ముఖ్యమంత్రి గారిని కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగిందని.ముఖ్యమంత్రి వెంటనే స్పందించి సంబంధిత అధికారులను ఇట్టి విషయం పైన విచారణ జరిపించాలని ఆదేశించిన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ మండలాల ప్రజాప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు తదితరులు పాల్గొన్నారు.