A place where you need to follow for what happening in world cup

రెండవ రోజు నాలుగు నామినేషన్లు..

కాంగ్రెస్ తరుపున మాజీకేంద్రమంత్రి నామినేషన్..

మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి నామినేషన్ ల దాఖలుకు రెండవరోజు అయిన శుక్రవారం నాలుగు నామినేషన్ లు వచ్చాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గా ములుగు నియోజకవర్గం, మదనపల్లి గ్రామానికి చెందిన మాజీకేంద్రమంత్రి పోరిక బలరాం నాయక్ నామినేషన్ ధాఖలు చేసారు. రిటర్నింగ్ అధికారి జిల్లాకలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్ కు బలరాంనాయక్ తన నామినేషన్ అందజేశారు. బలరాంనాయక్ వెంట మహబూబాబాద్ ఎమ్మెల్యే డాక్టర్ మురళినాయక్, ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే డాక్టర్ జాటోత్ రామచంద్రనాయక్, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య, పినపాక పాయం వెంకటేశ్వర్లు, కాంగ్రెస్ రాష్ట్రనాయకులు వెన్నం శ్రీకాంత్ రెడ్డి లు ఉన్నారు. బలరాంనాయక్ రెండు సెట్ల నామినేషన్ ల ను సమర్పించారు.

పినపాక నియోజకవర్గం మణుగూరుకు చెందిన పాల్వంచ దుర్గ స్వతంత్రఅభ్యర్థిగా నామినేషన్ వేసారు. ఆధార్ పార్టీ బలపరిచిన అభ్యర్థిగా నర్సంపేట నియోజకవర్గం నెక్కొండ మండలం ,ముదిగొండ గ్రామానికి జాటోత్ రఘు నాయక్ నామినేషన్ ను సమర్పించారు. నర్సంపేట నియోజకవర్గం, ఇటుకాలపల్లి గ్రామం, ఏనుగుల తండా కు చెందిన బోడ అనిల్ నాయక్ స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ ను రిటర్నింగ్ అధికారి అద్వైత్ కుమార్ సింగ్ ఎదుట దాఖలు చేశారు. మొత్తంగా శుక్రవారం 4 నామినేషన్లు దాఖలు కాగా, మహబూబాబాద్ పార్లమెంట్ స్థానానికి రెండురోజులకు గాను 5 నామినేషన్లు వచ్చాయి.

ఈ నామినేషన్ ప్రక్రియలో అదనపు సహాయ రిటర్నింగ్ అధికారులు లెనిన్ వత్సల్ టొప్పో, శ్రీజ, ఎండేవిడ్, ఆర్డీఓలు అలివేలు, నరసింహరావు, ఎంఆర్ఓ లు భగవాన్ రెడ్డి,దామోదర్, శ్వేత, సునీల్ రెడ్డి, ఎన్నికల విభాగం పర్యవేక్షణ అధికారి పవన్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.