24 గంటల్లో ప్రభుత్వ కార్యాలయాల వద్ద ప్రజా ప్రతినిధుల ఫోటోలు వివిధ పథకాల ప్రచార హోర్డింగులు , ఫ్లెక్సీలు తొలగించాలి 72 గంటలలో ప్రైవేటు స్థలాల్లో రాజకీయ పార్టీల ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్స్, హోర్డింగులు తొలగించాలినిష్పక్షపాతంగా ఎన్నికల విధులను అధికారులు నిర్వహించాలి ఎన్నికల కోడ్ వచ్చిన నేపథ్యంలో తీసుకోవాల్సిన చర్యలపై జిల్లా అధికారులతో రివ్యూ నిర్వహించిన జిల్లా కలెక్టర్ యస్. వెంకట్రావ్.కేంద్ర ఎన్నికల సంఘం తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన నేపథ్యంలో వెంటనే ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులోకి వస్తుందని, దీనిని కట్టుదిట్టంగా అమలు చేయాలని నియమించిన ఎన్నికల అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
సమీకృత జిల్లా కలెక్టరేట్ లో జిల్లా అధికారులతో ఎన్నికల ప్రవర్తన నియమావళి పై దిశా నిర్దేశ్యం చేశారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు పత్రికా సమావేశం నిర్వహించి తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిందని, ఇప్పటినుంచి ఎన్నికల ప్రవర్తన నియమాలు అమలులోకి వస్తుందని కలెక్టర్ అన్నారు.ఎన్నికల ప్రవర్తన నియమావళి జిల్లా అధికారులు అవగాహన పెంచుకోవాలని, నిష్పక్షిపాతంగా ఎన్నికల విధులను నిర్వహించాలని ఏ అభ్యర్థికి పార్టీకి మద్దతు తెలపడానికి వీలులేదని కలెక్టర్ తెలిపారు. ఎన్నికల విధులు నిర్వహించే సమయంలో ప్రభుత్వ అధికారిక వాహనాలు మాత్రమే ఉపయోగించాలని ప్రైవేట్ వాహనాలను ఉపయోగించవద్దని కలెక్టర్ పేర్కొన్నారు.
ప్రభుత్వ కార్యాలయాల్లో ఉన్న ముఖ్యమంత్రి, మంత్రుల ఫోటోలను వెంటనే తొలగించాలని, నూతన శంకుస్థాపనలు చేయవద్దని , ఎన్నికల ప్రవర్తన నియమావళిని వెంటనే కట్టుదిట్టంగా చేయాలని కలెక్టర్ సూచించారు.ప్రభుత్వ శాఖల పరిధిలో నూతన మంజూరు, నూతన శంకుస్థాపనలు పెట్టుకోవద్దని అన్నారు. ప్రతి ప్రభుత్వ కార్యాలయం పాఠశాల ఆసుపత్రి , ప్రభుత్వ భవనాలలో , గ్రామాల్లో, మున్సిపాలిటీ లో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించిన హోర్డింగులు నాయకుల ఫోటోలు , వాల్ రైటింగ్స్ 24 గంటల తొలగించాలని ఆయన అధికారులకు ఆదేశించారు.
ప్రభుత్వ అధికారులు సిబ్బంది ఏ పార్టీకి సంబంధించిన సందేశాలు ఫార్వర్డ్ చేయవద్దని తెలిపారు. రాజకీయ పార్టీలు నిర్వహించే సమావేశాలకు ర్యాలీలకు రెవెన్యూ డివిజన్ అధికారి పోలీస్ అధికారుల నుంచి తప్పనిసరిగా అనుమతి తీసుకోవాలని తెలిపారు. రాజకీయ పార్టీలు ఇచ్చే ప్రకటనలకు సైతం అనుమతి తీసుకోవాలని 72 గంటల్లో ప్రైవేటు స్థలాలలో సైతం రాజకీయ పార్టీలకు సంబంధించిన హోల్డింగులు ఫ్లెక్సీలు తొలగించాలని సూచించారు. అనంతరం MCC, FST, SST, VST, VVT టీం లకు నిర్వహించే వివిధ అంశాలపై మాస్టార్ట్ ట్రైనర్ పి. వెంకటేశ్వర్లు శిక్షణా తరగతులు నిర్వహించారు.ఈ సమావేశంలో జిల్లా యస్.పి. రాజేంద్ర ప్రసాద్, ఆదనవు కలెక్టర్లు ప్రియాంక, వెంకట్ రెడ్డి, ఆదనవు యస్.పి నాగేశ్వర్ రావు, డి.యస్.పి. లు జిల్లా అధికారులు, ఆర్.డి.ఓ లు , నోడల్ అధికారులు, ఎన్నికల సిబ్బంది పాల్గొన్నారు.