A place where you need to follow for what happening in world cup

దూకుడు పెంచుతున్న కాంగ్రెస్.. తెలంగాణ లోక్ సభ నియోజకవర్గాలకు ఏఐసీసీ పరిశీలకుల నియామకం..

  • టీఎస్ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పరిశీలకుల నియామకం 
  • హైదరాబాద్ పరిశీలకుడిగా ప్రసాద్ అబ్బయ్య
  • మల్కాజ్ గిరి పరిశీలకుడిగా రిజ్వాన్ అర్షాద్

ఈ ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. వచ్చే ఏడాది పార్లమెంటు ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణపై పార్టీ హైకమాండ్ పూర్తి స్థాయిలో దృష్టిని సారించింది. తెలంగాణలో సత్తా చాటేందుకు ఒక పక్కా ప్లానింగ్ తో ముందుకు సాగుతోంది. ఓ వైపు అధికార బీఆర్ఎస్ పార్టీపై ఎదురు దాడి చేస్తూనే… మరోవైపు పార్టీని బలోపేతం చేసుకునే పనిలో ఉంది. ఈ క్రమంలో రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాలకు పరిశీలకులను ఏఐసీసీ నియమించింది. వీరంతా రాబోయే తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు లోక్ సభ నియోజకవర్గాల పరిధిలో పార్టీని పర్యవేక్షిస్తారని ప్రకటనలో ఏఐసీసీ తెలిపింది. వీరి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పేర్కొంది.

లోక్ సభ నియోజక వర్గాల వారీగా పరిశీలకులు వీరే:

  •   ఆదిలాబాద్ – ప్రకాశ్ రాథోడ్ (ఎమ్మెల్సీ)
  •   భువనగిరి – శ్రీనివాస్ మానే (ఎమ్మెల్యే)
  •   చేవెళ్ల – అల్లం ప్రభు పాటిల్ (మాజీ ఎమ్మెల్సీ)
  •   హైదరాబాద్ – ప్రసాద్ అబ్బయ్య (ఎమ్మెల్యే)
  •   కరీంనగర్ – క్రిస్టఫర్ తిలక్ (ఏఐసీసీ సెక్రటరీ)
  •   ఖమ్మం – ఆరిఫ్ నసీమ్ ఖాన్ (మాజీ మంత్రి)
  •   మహబూబాబాద్ – పీటీ పరమేశ్వర్ నాయక్ (మాజీ మంత్రి)
  •   మహబూబ్ నగర్ – మోహన్ కుమారమంగళం
  •   మల్కాజ్ గిరి – రిజ్వాన్ అర్షాద్ (ఎమ్మెల్యే)
  •   మెదక్ – బసవరాజ్ మాధవరావ్ పాటిల్ (మాజీ మంత్రి)
  •   నాగర్ కర్నూల్ – పీవీ మోహన్
  •   నల్గొండ – అజయ్ ధరమ్ సింగ్ (ఎమ్మెల్యే)
  •   జహీరాబాద్ – సీడీ మేయప్పన్ (ఏఐసీసీ సెక్రటరీ)
  •   నిజామాబాద్ – బీఎం నాగరాజ్ (ఎమ్మెల్యే)
  •   పెద్దపల్లి – విజయ్ నామ్ దేవ్ రావ్ వడెట్టివార్ (ఎమ్మెల్యే)
  •   సికింద్రాబాద్ – రూబీ ఆర్ మనోహరన్ (ఎమ్మెల్యే)
  •   వరంగల్ – రవీంద్ర ఉత్తమ్ రావ్ దాల్వీ

Leave A Reply

Your email address will not be published.