- సోమారిపేట్ లో దారుణ సంఘటన
- సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీస్ లు
ఖానాపూర్, ముద్ర : నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలంలోని సోమరిపేట్ (ఎర్వాచింతల్ ) గ్రామంలో భర్తను గొడ్డలితో నరికి చంపిన దారుణ సంఘటన చోటు చేసుకుంది. పిట్టల నడిపి రాజన్న (41) ను అతని భార్య పిట్టల లక్ష్మి మంగళవారం రాత్రి ఇంట్లో ఉన్న గొడ్డలితో తలపైన బాధి చంపింది. మృతుడు రాజన్న భార్య లక్ష్మి తో రోజు గొడవ పడుతూ తీవ్రంగా ఇబ్బంది పెట్టవాడు. మంగళవారం పలుమార్లు తాగి వచ్చి గొడవ చేయవద్దని చెప్పిన వినలేదు.
మంగళవారం రాత్రి కూడా మద్యం సేవించి ఇంటికి వచ్చిన భర్త మళ్ళీ గొడవ చేస్తూ ఇబ్బంది పెట్టటంతో భాదను భరించలేక ఆవేశంలో గొడ్డలితో నడిపి రాజన్న తలపై కొట్టగా తలకు బలమైన గాయం అయి అక్కడికక్కడే చనిపోయినాడు. వీరికి ఇద్దరు కుమారులు ఉన్నారు. సంఘటన స్థలాన్ని ఖానాపూర్ సిఐ డి. మోహన్, ఖానాపూర్ ఎస్సై జి. లింబాద్రి పరిశీలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.