A place where you need to follow for what happening in world cup

భూపాలపల్లి జిల్లాలో పుష్కలంగా నీటి వనరులు, ఖనిజ సంపద

అశాస్త్రీయంగా కట్టడంతోనే మేడిగడ్డ బ్యారేజీ కుంగుబాటు
ఇప్ప‌టివ‌ర‌కు మ‌హాల‌క్షి కింద‌  63 కోట్ల మంది మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం
రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

ప్రజల దీవెనతో ఇందిరమ్మ రాజ్యం
రైతును రాజు చేయడమే ప్రభుత్వ లక్ష్యం
ప్రతీ గ్రామానికి ఇందిరమ్మ ఇండ్లు నిర్మిస్తాం
ధ‌ర‌ణి, డబుల్ బెడ్ రూమ్ పేరుతో బిఆర్ఎస్ మోసం
రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

ఉపాధి కోసం యువత పట్టణాలకు వ‌ల‌స‌
పంచాయతీరాజ్ శాఖ మంత్రి  సీతక్క
జిల్లాలో ముగ్గురు మంత్రుల పర్యటన విజయవంతం
వన మహోత్సవంలో పాల్గొన్న మంత్రులు
100పడకల ఆసుపత్రిలో డ్రగ్ స్టోరేజ్ రూమ్, డాక్టర్ల క్యాంటీన్ ప్రారంభించిన మంత్రులు
సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో అధికారులతో సమీక్ష

 
 
image.png

 
 
 
image.png

image.png
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో నీటి వనరులు ఖనిజ సంపద పుష్కలంగా ఉన్నాయని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి దిద్దిల శ్రీధర్ బాబు అన్నారు శనివారం జిల్లాలో ముగ్గురు మంత్రులు పర్యటించి గణపురం మండలంలోని గాంధీనగర్ మైలారం గుట్టలపై ఇండస్ట్రియల్ పార్క్ నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశం భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. భూపాలపల్లి జిల్లా లో రెండు బ్యారేజీల ఉన్నాయనీ, గత ప్రభుత్వంలో వాటి ద్వారా భూపాలపల్లి, మంథ‌ని నియోజక వర్గానికి ఒక్క ఎకరానికి కూడా నీరందించ‌లేదన్నారు.అశాస్త్రీయ బద్ధంగా మేడిగడ్డ బ్యారేజి కడితే కుంగిపోయింద‌ని వివరించారు. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుకు కాంగ్రెస్ పార్టీ ఏదో కుట్ర చేశారని ఆరోపించడం విడ్డూరంగా ఉందన్నారు.

డిసెంబర్ 7 తేదీన ప్రమాణ స్వీకారం చేసి అధికారులను ప్రజల వద్దకు తీసుకెళ్లడం కోసం క్యాబినెట్ ముందుకు సాగిందని తెలిపారు. 9వ తేదీన మహిళలకు ఉచిత బస్సు  ఏర్పాటు చేశామని, 63 కోట్ల ప్రయాణాలు మహిళాలు చేశారని వెల్లడించారు. మంత్రి సీతక్క, సీఎం రేవంత్ రెడ్డి మహిళలను లక్షలాది కారులను చేస్తామంటే  ప్రతిపక్షాలు నవ్వుతున్నారని, ఈ రోజు కోటి మందిని స్వశక్తి మహిళా  గ్రూపు సభులు గా చేర్చి  మహిళాను లక్షాధికారులను చేయడానికి ప్రణాలికలు రూపొందించారని తెలిపారు.
శాసన సభ్యుడు గండ్ర సత్యనారాయణ రావు పారిశ్రామికంగా అభివృద్ధి చేయడానికి ఎంతో కష్టపడ్డాడని తెలిపారు. ఎమ్మెల్యే సంకల్పం తో తాము శంకుస్థాపన చేసి నిరుద్యోగులకు ఉద్యోగకల్పన జరుగుతుందని తెలిపారు.200 పరిశ్రమలను ఏర్పాటుకు చేస్తా మనీ, మొట్టమొదటి పరిశ్రమ శంకుస్థాపన రెండు నెలల్లో చేస్తామని ప్రకటించారు.ఐటీ రంగ ఉద్యోగులు కూడా సాఫ్ట్ వేరే కంపెనీలు కావాలని కోరుతున్నారని,ఐటీ నిపుణులతో సంప్రదించి కార్యాచ‌రణ రూపొందిస్తామని తెలిపారు. మేము 6 గ్యారంటీల అమలుకు  ముందుకు పోతున్నామని తెలిపారు. ప్రతి నియోజక వర్గం లో ఇందిరమ్మ ఇల్లు త్వరలో ఇవ్వబోతున్నమని వెల్లడించారు. రైతులకు 31 వేల కోట్ల రూపాయలు రెండు విడతలలో రుణ మాఫీ చేసి లక్ష, లక్ష యాభై వేలు రుణ మాఫీ చేశామని తెలిపారు. గత ప్రభుత్వం ప‌దేళ్ల‌లో ఎలాంటి కార్యక్రమాలు చేపట్ట లేదన్నారు. ధరణినిని  మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి  నాయకత్వంలో ప్రక్షాళన చేస్తున్నామని వెల్లడించారు. ప్రతీ నియోజకవర్గ కేంద్రంలో మినీ పారిశ్రామిక పార్కు ఏర్పాటు చేయాలని మంత్రి సీతక్క కార్యచరణ చేపట్టబోతున్నట్లు ప్రకటించారు. మహిళల పేరిట, ఈ రాష్ట్రం పేరిట బ్రాండింగ్ ను సైతం ఏర్పాటు చేయబోతున్నట్లు ప్రకటించారు. ములుగు, భూపాలపల్లి ప్రాంతానికి సాగు నీటి అవసరాలు తీర్చడానికి ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు. అతి త్వరలో ఇరిగేషన్ మంత్రితో మాట్లాడి డిపిఆర్ తయరు చేస్తామన్నారు. 35 వేల ఎకరాలకు, గ్యాప్ ఆయకట్టు కు సంబంధించి ఆలోచన చేస్తామని తెలిపారు.
రాష్ట్ర యువతకు నైపుణ్యం పెంచడానికి ఒక గొప్ప ఆలోచనలో భాగంగా యంగ్ ఇండియా స్కిల్ ఇండస్ట్రీని హైదరాబాదులో ఏర్పాటు చేయబోతున్నామని అన్నారు. సింగరేణి, జెన్ కో,పారిశ్రామికంగా  ఒక మాస్టర్ ప్లాన్ ద్వారా నియోజక వర్గాన్ని అభివృద్ధి చేస్తామని తెలిపారు.పోడు భూముల సమస్యలు రాకుండా చూడాలని అటవీ అధికారులకు ,పోలీసులకు న్యాయ పరంగా వ్యవహరించాలని ఆదేశాలు ఇచ్చామని తెలిపారు.

ప్రజల దివెనలతో ఇందిరమ్మ రాజ్యం : మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి

రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అభివృద్ది సంక్షేమం రెండు రెండు కళ్ల లాగ జోడెడ్ల లాగా సాగుతున్నాయని అన్నారు. గ్రామీణ ప్రాంత యువత ఆలోచనకు అనుగుణంగా ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు కాబోతుందని వెల్లడించారు.సీఎం రేవంత్ రెడ్డి  చెప్పిన మాటలను తూచా తప్పకుండా అమలుచేస్తూ ఇందిరమ్మ రాజ్యం చెప్పిన మాట ప్రకారం రైతూ రుణమాఫీ, రైతు భరోసా, పంటల బీమా, విత్తనాలకు సబ్సిడీ ఇస్తూ రైతులను రాజులు గా చేస్తుందని అన్నారు. జిల్లాలో అర్హులై భూములు సాగు చేసుకుంటున్న వారికి పట్టాలు అందిస్తామని తెలిపారు.ఈ నెల చివరి వరకు 4.50 లక్షల ఇందిరమ్మ ఇల్లు యుద్ధ ప్రాతిపదికన ప్రతి గ్రామానికి ఇస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం లో డబుల్ బెడ్ రూమ్ ఇస్తామని ఇదిగో అదిగో అని మాయ మాటలు చెప్పి 10 సంవత్సరాల లో కేవలం 1.50 లక్షల ఇల్లు మత్రమే కట్టిందని, కానీ త‌మ‌ ప్రభుత్వం మొదటి విడతలోనే 4.50 లక్షల ఇళ్లు కట్టిస్తుందని తెలిపారు.

ఉపాధి కోసం ప్రజలు పట్టణాలకు వ‌ల‌స‌ : మంత్రి సీతక్క

మంత్రి శ్రీధర్ బాబు నాయకత్వంలో మారుమూల ప్రాంతాల్లో ఇండస్ట్రీస్ ఏర్పాటు చేస్తూ గ్రామీణ యువత పట్టణాలకు ఉపాధి కోసం వెళ్లకుండా చేస్తున్నామ‌ని మంత్రి సీత‌క్క అన్నారు. భూపాలపల్లి కి ఇండస్ట్రియల్ పార్క్  రావడం సంతోషంగా ఉందని అన్నారు. ములుగు లో కూడా ఏర్పాటు చేస్తామని, నేషనల్ హైవే సమీపంలో స్థల సేకరణ చేస్తున్నామని వెల్లడించారు. గ‌త ప్రభుత్వం ధరణి తెచ్చి ఎందరినో ఇబ్బందులు పెట్టింద‌ని, సీఎం రేవంత్ రెడ్డి  భూమాతను తీసుకొస్తున్నార‌ని తెలిపారు. జాబ్ క్యాలెండర్ ప్రకటించామని,.స్కిల్ ఇండియా ద్వారా యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయని వెల్లడించారు.  కార్యక్రమంలో ఎంపీ డాక్టర్ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు ,టి జి ఐ ఐ చైర్మన్ నిర్మల జగ్గారెడ్డి, ట్రేడ్ కార్పొరేషన్ చైర్మన్ ఐత ప్రకాష్ రెడ్డి, జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ, ఎస్పి కిరణ్ కరే తోపాటు అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.