ఇద్దరి పరిస్థితి విషమం
సారంగాపూర్ మండలం మహబూబ్ ఘాట్ సమీపంలో బుధవారం అర్ధరాత్రి ప్రైవేటు బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో 28 మందికి గాయాలయ్యాయి. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. ఆదిలాబాద్ నుండి హైదరాబాద్ వెళుతున్న ముస్కాన్ ట్రావెల్స్ కు సంబంధించిన బస్సు 50 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తోంది. ఈ క్రమంలో ముందు వెళుతున్న కారు ను తప్పించబోయి బోల్తా పడింది.

ఈ ఘటనలో క్షతగాత్రులైన వారిని నిర్మల్ ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ఇద్దరు పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది. కాగా కాంగ్రెస్ నాయకులు అర్జుమంద్, జునైద్ మెమన్ లు ఆసుపత్రికి వెళ్లి గాయపడిన వారిని పరామర్శించారు.