A place where you need to follow for what happening in world cup

హైదరాబాద్‌లో భారీ వర్షం.. పలుచోట్ల ట్రాఫిక్ జామ్

  • ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం
  • కూకట్ పల్లి, బాలానగర్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో వర్షం
  • ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసుల ఇబ్బందులు

హైదరాబాద్ నగరంలో భారీ వర్షం పడుతోంది. సాయంత్రం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తోంది. కూకట్ పల్లి, బాలానగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, కుత్బుల్లాపూర్, కూకట్ పల్లి, పంజాగుట్ట, ఉప్పల్, అమీర్ పేట, సికింద్రాబాద్ తదితర ప్రాంతాల్లో కుండపోత కురిసింది.

దీంతో ఎక్కడికక్కడ ప్రధాన రోడ్లపై నీరు నిలిచింది. ఉద్యోగులు ఇళ్లకు వెళ్లే సమయం కావడంతో నగరంలో పలుచోట్ల ట్రాఫిక్ జామ్ అయింది. ట్రాఫిక్‌ను క్లియర్ చేసేందుకు పోలీసులు ఇబ్బందిపడ్డారు. వర్షం కారణంగా మియాపూర్-గండిమైసమ్మ మార్గంలో చెట్లు విరిగిపోయాయి. ట్రాఫిక్ పోలీసులు చెట్లను తొలగించారు.

Leave A Reply

Your email address will not be published.