A place where you need to follow for what happening in world cup

రాత్రి భోజనం పెట్టలేదని భార్య తలనరికి, చర్మం ఒలిచి హత్య

  • కర్ణాటకలోని తుముకూరు జిల్లాలో దారుణం
  • కునిగల్ తాలూకాకు చెందని దంతపుల మధ్య తరచూ తగవులు
  • సోమవారం రాత్రి మళ్లీ గొడవపడ్డ దంపతులు
  • భార్య తనకు భోజనం పెట్టకపోవడంతో రెచ్చిపోయిన నిందితుడు
  • ఆమె తల నిరికి హత్య, ఆపై చర్మం ఒలిచి, శరీరాన్ని ముక్కలుగా నరికి దారుణం

కర్ణాటకలో దారుణం వెలుగు చూసింది. బార్య తనకు రాత్రి భోజనం పెట్టలేదన్న కోపంతో విక్షణ కోల్పోయిన ఓ వ్యక్తి ఆమె తలనరికి చంపేశాడు. తుమకురూ జిల్లాలో సోమవారం వెలుగు చూసిన ఈ ఘటన వివరాలను పోలీసులు గురువారం వెల్లడించారు.

పూర్తి వివరాల్లోకి వెళితే, కునిగల్ తాలూకాకు చెందిన శివరామ, పుష్పలతకు పదేళ్ల క్రితం వివాహం జరిగింది. వారికి ఎనిమిదేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. భార్యాభర్తలు తరచూ గొడవపడుతుండే వారు. కాగా, సోమవారం రాత్రి కూడా వారు శివరామ ఉద్యోగం విషయమై గొడవపడ్డారు. ఆ రాత్రి ఆమె అతడికి భోజనం పెట్టలేదు. దీంతో, తీవ్ర ఆగ్రహంలో విచక్షణ మరిచిన శివరామ కత్తి ఆమె తల నరికేశాడు. ఆ తరువాత ఆమె చర్మం మొత్తం రాత్రంతా ఒలిచాడు. ఆమె మృతదేహాన్ని ముక్కలు చేశాడు. మరునాడు ఉదయం తను పని చేస్తున్న సంస్థ యజమానులకు సమాచారం అందించాడు. ఘటన జరిగిన సమయంలో వారి కుమారుడు నిద్రిస్తున్నాడు.

కాగా, ఘటన స్థలిలో తమకు మహిళ మృతదేహం రక్తపు మడుగులో కనిపించిందని పోలీసులు చెప్పాడు. నిందితుడు ఆమె చర్మం పూర్తిగా ఒలిచాడని తెలిపారు. నిందితుడు కూడా అక్కడే ఉన్నాడని తెలిపారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.