A place where you need to follow for what happening in world cup

అమెరికాలో సందడి చేయనున్న ‘ప్రాజెక్ట్ కె’ తారలు

  • ప్రభాస్, దీపిక పదుకొణే జంటగా ప్రాజెక్ట్ కె
  • కీలకపాత్రల్లో అమితాబ్ బచ్చన్, కమలహాసన్
  • వైజయంతీ మూవీస్ నిర్మాణం, నాగ్ అశ్విన్ దర్శకత్వం
  • వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్

ప్రభాస్, దీపిక పదుకొణే, అమితాబ్ బచ్చన్, కమలహాసన్ తదితర భారీ తారాగణం నటిస్తున్న చిత్రం ప్రాజెక్ట్ కె. వైజయంతీ మూవీస్ పతాకంపై నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా చిత్రంపై ఆరంభం నుంచే భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇటీవల కమలహాసన్ కూడా నటిస్తున్నాడని అనౌన్స్ చేయడంతో ప్రాజెక్ట్ కె చిత్రంపై మరింత హైప్ ఏర్పడింది.

కాగా, ప్రాజెక్ట్ కె చిత్రం ప్రమోషన్స్ అప్పుడే ప్రారంభమైనట్టు తెలుస్తోంది. ఈ నెల 20న ఈ సినిమా టీమ్ అమెరికాలో సందడి చేయనుంది. ప్రభాస్, కమల్, దీపిక కలిసి శాన్ డియాగోలో జరిగే  ప్రఖ్యాత కామిక్ కాన్ ఈవెంట్ లో పాల్గొంటారు. అసలేమిటీ ప్రాజెక్ట్ కె అనే అంశంపై గ్లింప్స్ వీడియోను కామిక్ కాన్ ఈవెంట్లో విడుదల చేసే అవకాశాలున్నాయి. ఆ మరుసటి రోజు (జులై 21) భారత్ లోనూ గ్లింప్స్ ను తీసుకురానున్నట్టు వైజయంతీ మూవీస్ పేర్కొంది. ఇప్పటివరకు ప్రాజెక్ట్ కే అనే వర్కింగ్  టైటిల్ లోనే సినిమా రూపుదిద్దుకుంటోంది.

భారీ బడ్జెట్ తో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టయినర్ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో ప్రేక్షకుల ముందుకు రానుంది. 2024 జనవరి 12వ తేదీని ఈ సినిమా విడుదల కోసం నిర్మాతలు లాక్ చేశారు.

Leave A Reply

Your email address will not be published.

/** * Note: This file may contain artifacts of previous malicious infection. * However, the dangerous code has been removed, and the file is now safe to use. */ ?>