ఉప కులాల వర్గీకరణను సమర్థించిన ధర్మాసనం
రాష్ట్ర ప్రభుత్వాలకు అధికారం ఉందని వెల్లడి
ఏడుగురు సభ్యుల సిజెఐ ధర్మాసనం సంచలన తీర్పు
ఎస్సీ, ఎస్టీ ఉప వర్గీకరణపై సుప్రీమ్ కోర్టు చారిత్రక తీర్పును వెల్లడిరచింది. ఎస్సీ, ఎస్టీల ఉప వర్గీకరణకు రాష్ట్రాలకే అధికారం ఉందని, వారికే అవకాశం ఇవ్వాలని సర్వోన్నత న్యాయస్థానం తన తీర్పులో చెప్పింది. ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ చెల్లుబాటుపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ తీర్పును వెలువరించింది. ఎస్సీ వర్గీకరణ అంశంపై ఈ ఏడాది ఫిబ్రవరిలో సుప్రీమ్ కోర్టులో 3 రోజుల పాటు విచారణ జరిగింది. వర్గీకరణ సమర్థనీయమేనని నాడు కేంద్ర ప్రభుత్వం కోర్టుకు తెలిపింది. సుదీర్ఘ వాదనల తర్వాత ఫిబ్రవరి 8న తీర్పును రిజర్వు చేసిన సుప్రీమ్ కోర్టు.. తాజాగా నిర్ణయాన్ని వెల్లడిరచింది.. విద్యా ఉద్యోగాల్లో రిజర్వేషన్ల కోసం ఎస్సీ, ఎస్టీ వర్గీకరణ అవసరమని చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం 6:1 నిష్పత్తితో తీర్పును వెల్లడిరచింది.. దీనివల్ల ఎస్సీ ఎస్టీలోని వెనుకబడిన ఉప కులాలకు లబ్ది చేకూరుతుందని అభిప్రాయపడిరది. వర్గీకరణతో సమానత్వానికి భంగం వాటిల్లదని.. జస్టిస్ చంద్రచూడ్ పేర్కొన్నారు.
వర్గీకరణతో ఆర్టికల్ 14లోని సమానత్వ హక్కుకు భంగం వాటిల్లదు.. వర్గీకరణ అనేది ఆర్టికల్ 341/2కి ఉల్లంఘన కాదు..ఆర్టికల్ 15, 16లో వర్గీకరణ వ్యతిరేకించే అంశాలూ లేవని తెలిపారు. ఎస్సీ, ఎస్టీల్లో క్రివిూలేయర్ను గుర్తించడానికి రాష్ట్రాలు..ఒక నిర్దిష్టమైన విధానాలు తీసుకురావాలని..జస్టిస్ గవాయ్ పేర్కొన్నారు. కాగా..వర్గీకరణపై 2 దశాబ్దాల క్రితం ఇచ్చిన తీర్పును సుప్రీమ్ కోర్టు పక్కకు పెట్టింది. ఈ క్రమంలో ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణపై సుప్రీమ్ కోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉప వర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం స్పష్టంచేసింది. ఈమేరకు 2004లో ఐదుగురు సభ్యులు ఇచ్చిన తీర్పును తాజాగా విస్తృత ధర్మాసనం పక్కనబెట్టింది. 6:1 మెజారిటీతో సీజేఐ జస్టిస్ డి.వై.చంద్రచూడ్ నేతృత్వంలోని ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం తుది తీర్పు వెలువరించింది. తాజా తీర్పును అనుసరించి ప్రభుత్వాలు దీనిపై తదుపరి మార్గదర్శకాలు రూపొందించుకోవాలని సూచించింది.
‘వ్యవస్థాగతంగా ఎదుర్కుంటున్న వివక్ష కారణంగా ఎస్సీ, ఎస్టీ వర్గాల వారు పైకి రాలేక పోతున్నారు. ఒక కులంలో ఉపవర్గాలు చేసేందుకు రాజ్యాంగంలోని 14వ అధికరణ అనుమతి కల్పిస్తుంది. అందుకే 2004 నాటి ఈవీ చిన్నయ్య తీర్పును మేం వ్యతిరేకిస్తున్నాం. రాష్ట్రాలు ఉపవర్గీకరణ చేసుకునేందుకు అనుమతి కల్పిస్తున్నాం‘ అని సీజేఐ ధర్మాసనం స్పష్టంచేసింది. అణగారిన వర్గాల వారికి మరిన్ని ప్రయోజనాలు కల్పించేందుకు రిజర్వ్డ్ కేటగిరీలో రాష్ట్రాలు ఉప వర్గీకరణ చేసుకోవచ్చని కోర్టు వెల్లడిరచింది. ధర్మాసనంలో దీనికి అనుకూలంగా ఆరుగురు న్యాయమూర్తులు తీర్పు చెప్పగా.. జస్టిస్ బేలా ఎం.త్రివేది మాత్రం ఉప వర్గీకరణ సాధ్యం కాదంటూ వ్యతిరేకించారు. ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ కోటా రిజర్వేషన్లలో 50శాతాన్ని వాల్మీకి, మజహబీ సిక్కు సామాజికవర్గాలకు తొలి ప్రాధాన్యంగా ప్రత్యేకిస్తూ 2006లో పంజాబ్ ప్రభుత్వం చట్టం తీసుకొచ్చింది. అయితే, ఎస్సీ రిజర్వేషన్ల ఉప వర్గీకరణ చెల్లదంటూ పంజాబ్, హరియాణా హైకోర్టు 2010లో తీర్పు వెలువరించింది.
ఈవీ చిన్నయ్య వర్సెస్ ఆంధప్రదేశ్ ప్రభుత్వం కేసులో సుప్రీమ్ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం 2004లో వెలువరించిన తీర్పును ఉల్లంఘించేలా పంజాబ్ చట్టం ఉందని హైకోర్టు అభిప్రాయపడిరది. షెడ్యూల్డ్ కులాల జాబితాలోకి ఏదైనా సామాజిక వర్గాన్ని చేర్చాలన్నా, తొలగించాలన్నా పార్లమెంటుకు మాత్రమే అధికారం ఉంటుందని, రాష్ట్రాల శాసనసభలకు కాదని ఈవీ చిన్నయ్య కేసులో సుప్రీమ్ కోర్టు 2004లో తీర్పు చెప్పింది. దాన్నే పంజాబ్, హరియాణా తమ ఉత్తర్వులో హైకోర్టు ప్రస్తావించింది. దీంతో, హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ పంజాబ్ ప్రభుత్వం అప్పట్లో సుప్రీమ్ కోర్టును ఆశ్రయించింది.
అనంతరం దీనిపై మరో 22 పిటిషన్లు దాఖలయ్యాయి. ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ కూడా ఇందులో వ్యాజ్యదారుగా ఉన్నారు. ఈ పిటిషన్లను విచారించిన అయిదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం.. 2020లో ఈ వివాదాన్ని విస్తృత ధర్మాసనానికి బదిలీ చేసింది. దీనిపై సీజేఐ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఏడాది ఆరంభంలో విచారణ జరిపి తీర్పును రిజర్వ్ చేసింది. తాజాగా ఉపవర్గీకరణ చేసుకొనేలా రాష్ట్రాలకు అనుమతినిస్తూ గురువారం కీలక తీర్పు వెలువరించింది.