A place where you need to follow for what happening in world cup

కాస్మెటిక్‌ ‌కాదు.. కాంక్రీట్‌ ‌పోలీసింగ్‌ అవసరం

కాస్మెటిక్‌ ‌కాదు..కాంక్రీట్‌ ‌పోలీసింగ్‌ అవసరమని, ఫ్రెండ్లీ పోలీసింగ్‌ ‌బాధితులకు మాత్రమే కానీ, నేరస్తులకు కాదని సిఎం రేవంత్‌ ‌రెడ్డి తెలిపారు. డ్రగ్స్‌పై ఉక్కు పాదం మోపాలని సిఎం రేవంత్‌ ‌రెడ్డి పోలీసులకు సూచించారు. వ్యసనాలకు బానిసలైన కొంతమంది ప్రజలు డ్రగ్స్, ‌గంజాయి, సైబర్‌  ‌నేరాలకు పాల్పడుతున్నారని సిఎం ఆవేదన వ్యక్తం చేశారు. అయితే మన పోలీసులను చూస్తుంటే తెలంగాణ డ్రగ్స్ ‌రహితంగా మారుతుందన్న నమ్మకం కలుగుతుందని అన్నారు. ఇది ఉద్యోగ బాధ్యత కాదని, భావోద్వేగమని, తెలంగాణను పునర్నిర్మించి, భవిష్యత్‌ ‌తరాలకు బాటలు వేయాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు.

 

ఏ సమస్య వొచ్చినా ముందుగా అందుబాటులో ఉండేది పోలీసులేనని అన్నారు. డ్రగ్స్, ‌గంజాయిపై ఉక్కు పాదం మోపుతామని, డ్రగ్స్ ‌పేరు వింటేనే వెన్నులో వణుకు పుట్టాలని, తెలంగాణను కాపాడుకునేందుకు ఖాకీ డ్రస్సులనే విశ్వాసం ప్రజలకు కల్పించాలని పోలీసులకు సిఎం పిలుపునిచ్చారు. బుధవారం హిమాయత్‌ ‌సాగర్‌లోని రాజా బహదూర్‌ ‌వెంకటరామ్‌ ‌రెడ్డి తెలంగాణ స్టేట్‌ ‌పోలీస్‌ అకాడమీలో శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్‌ఐ, ఎఎస్‌ఐల పాసింగ్‌ అవుట్‌ ‌పరేడ్‌కు సిఎం ర్తే రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్‌ ‌విభాగం తరపున రూ.11 కోట్ల 6లక్షల 83వేల 571లకు ముఖ్యమంత్రి సహాయనిధికి డీజీపీ జితేందర్‌, ‌శివధర్‌ ‌రెడ్డి తదితరులు సిఎంకు అందజేశారు. • ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ…యువత ప్రాణత్యాగాలతో తెలంగాణ సాధించుకున్నామని, స్వరాష్ట్రం వొచ్చినా గత తొమ్మిదేళ్లలో నిరుద్యోగుల ఆకాంక్షలు నెరవేరలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

 

ఇప్పుడు ప్రజల మద్దతుతో రాష్ట్రంలో ప్రజా ప్రభుత్వం ఏర్పడిందని, అధికారంలోకి వొచ్చిన మూడు నెలల్లోనే 30 వేల ఉద్యోగాలను భర్తీ చేశామని, తెలంగాణ పబ్లిక్‌ ‌సర్వీస్‌ ‌కమిషన్‌ను ప్రక్షాళన చేశామని, గ్రూప్‌ 2 ‌పరీక్ష వాయిదా వేసి నిరుద్యోగులకు అనుకూలంగా నిర్ణయం తీసుకున్నామని, దాంతో నిరుద్యోగ యువకులు ఉత్సాహంతో పరీక్షలకు సిద్ధం అవుతున్నారని సంతోషం వ్యక్తం చేశారు. ఇక సైనిక్‌ ‌స్కూల్‌ ‌తరహాలో ఒక్కొక్క స్కూల్‌కు 50 ఎకరాలలో హైదరాబాద్‌, ‌వరంగల్‌లలో పోలీసుల పిల్లల కోసం రెసిడెన్షియల్‌ ‌పోలీస్‌ ‌స్కూల్‌ ఏర్పాటు చేస్తామని సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఈ సందర్భంగా ప్రకటించారు. అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్యతో రాబోయే రెండేళ్లలో హైదరాబాద్‌లో పోలీస్‌ ‌స్కూల్‌ ఏర్పాటు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. తమ ప్రభుత్వం పెట్టుబడులు తీసుకురావడమే కాదని, రైతన్నలు, నేతన్నలు, గీతన్నలను ఆదుకుంటుందన్నారు. కేవలం 28 రోజుల్లోనే 22 లక్షల 22 వేల 685 రైతుల ఖాతాల్లో రూ.18వేల కోట్లు వేసి రుణమాఫీ చేసామని అన్నారు. కడుపు కట్టుకుని నిధులు సేకరించి రుణమాఫీ చేసి రైతుల కళ్లల్లో ఆనందం చూస్తున్నామన్నారు. హైడ్రాపై కొందరు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, చెరువులు, కుంటలు, నాలాల ఆక్రమణల వల్లే వరదలు వొస్తున్నాయన్నారు.

 

వరదలతో పేదల జీవితాలు అతలాకుతలం అవుతున్నాయని, అందుకే చేరబట్టిన వారి నుంచి చెరువులను విడిపిస్తున్నామన్నారు. అవసరమైతే ఆక్రమణదారులను జైలుకు పంపేందుకూ వెనకాడమన్నారు. ఆక్రమించుకున్న చెరువులను స్వచ్చందంగా వదలాలని ఆక్రమణదారులకు సిఎం ఈ సందర్భంగా విజ్ఞప్తి చేశారు. లేకపోతే  చెరువులలోని అక్రమ నిర్మాణాలను నేలమట్టం చేసి తీరుతామని, నాలాల ఆక్రమణలను నిరభ్యంతరంగా కూల్చేస్తామని, మూసీని ప్రక్షాళన చేస్తామని సిఎం పునరుద్ఘాటించారు. మూసీ నాలాల్లో ఉన్న శాశ్వత నివాసదారులకు డబుల్‌ ‌బెడ్రూమ్‌ ఇం‌డ్లు అందిస్తామని, నివాసితులైన 11 వేల మందిలో ప్రతీ ఒక్కరికీ ప్రభుత్వం పునరావాసం కల్పిస్తుందని తెలిపారు.

ఎఫ్టీఎల్‌, ‌బఫర్‌  ‌జోన్‌ ‌పరిధిలో నిర్మాణాలను రెగ్యులరైజ్‌ ‌చేసే ప్రసక్తే లేదని సిఎం రేవంత్‌ ‌రెడ్డి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. తెలంగాణ పోలీస్‌ అకాడేమి నుండి బుధవా 547 సబ్‌ ఇన్స్‌పెక్టర్లు పాసింగ్‌ అవుట్‌ ‌పరేడ్‌ ‌నిర్వహించారు. ట్రైనింగ్‌ ‌పూర్తి చేసుకున్న వారిలో 145 మంది మహిళా ఎస్‌ఐలు, 402 మంది పురుషులు ఉన్నారు. 547 లో 401 మంది సివిల్‌ ఎస్‌ఐలు ఉన్నారు. అలాగే 547లో 472 మంది గ్రాడ్యూయేట్స్, 75 ‌మంది పోస్ట్ ‌గ్రాడ్యూఎట్స్ ఉన్నారు. వీరిలో 248 మంది ఎస్‌ఐలకు బీటెక్‌ ‌బ్యాక్‌ ‌గ్రౌండ్‌ ఉం‌ది. పరేడ్‌ ‌కమాండర్‌గా మహిళా ఎస్‌ఐ ‌పల్లి బాగ్యశ్రీ వ్యవహరించారు. ట్రైనింగ్‌ ‌పూర్తిచేసుకున్న వారిలో అత్యధికంగా 26 నుంచి ముప్పై వయసు గల అభ్యర్థులు ఉన్నారు. 283 మంది 26 నుంచి 30 సంవత్సరాల వయసు కలవారు శిక్షణ పొందారు. అలాగే 182 మంది 25 ఏళ్ళ లోపు వయసున్నవారు సబ్‌ ఇన్స్‌పెక్టర్లుగా శిక్షణ పొందారు.

Leave A Reply

Your email address will not be published.