A place where you need to follow for what happening in world cup

పాస్ పోర్టు ఆఫీసర్ గా మెగాస్టార్!

0 71
  • కల్యాణ్ కృష్ణతో చిరూ మూవీ 
  • సుస్మిత నిర్మాతగా రూపొందనున్న సినిమా
  • కథానాయికగా కనిపించనున్న త్రిష 
  • ముఖ్యమైన పాత్రలో అలరించనున్న శ్రీలీల 

చిరంజీవి తన తదుపరి ప్రాజెక్టుల కోసం వరుసగా యంగ్ డైరెక్టర్లను లైన్లో పెడుతున్నారు. అనిల్ రావిపూడి .. కల్యాణ్ కృష్ణ … శ్రీవశిష్ఠలతో సినిమా చేయడానికి ఆయన రెడీ అవుతున్నారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. అనిల్ రావిపూడితో యాక్షన్ కామెడీ .. శ్రీవశిష్ఠతో ఫాంటసీ జోనర్లో చేయనున్నట్టుగా చెబుతున్నారు.

ఇక కల్యాణ్ కృష్ణతో చేయనున్న సినిమాకి వచ్చేసరికి మరో ఆసక్తికరమైన విషయం వినిపిస్తోంది. ఈ సినిమాలో చిరంజీవి ‘పాస్ పోర్టు ఆఫీసర్’ గా కనిపించనున్నారని అంటున్నారు. ఈ పాత్రలో ఆయన లుక్ చాలా స్టైలీష్ గా ఉండనుందని చెబుతున్నారు. ఈ తరహా పాత్రను చిరంజీవి పోషించడం ఇదే మొదటిసారి.

చిరంజీవి పెద్ద కూతురు సుస్మిత తన సొంత బ్యానర్ పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఇది మలయాళంలో మోహన్ లాల్ చేసిన ఒక సినిమాకి రీమేక్ అనే టాక్ వచ్చింది. అయితే అందులో ఎంతమాత్రం నిజం లేదని చెబుతున్నారు. త్రిష కథానాయికగా నటించనున్న ఈ సినిమాలో, శ్రీలీల ముఖ్యమైన పాత్రలో కనిపించనుంది.

Leave A Reply

Your email address will not be published.