- తెలంగాణ ఉద్యమకారులారా..
నాతో పాటు టీఆర్‌ఎస్‌లో పనిచేసిన నాయకులారా.. - తెలంగాణ అభివృద్ధి కోసం, దేశాభివృద్ధికి బీజేపీకి
వోటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించండి - మల్కాజిగిరి ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్
తెలంగాణ ఉద్యమకారులారా.. నాతో పాటు టీఆర్‌ఎస్ లో పనిచేసిన నాయకులారా..
తెలంగాణ అభివృద్ధి కోసం, దేశాభివృద్ధికి బీజేపీకి వోటు వేయండనీ ఈటల రాజేందర్ పేర్కొన్నారు.
కాంగ్రెస్ పుట్టిన యూపీ లోనే అడ్రస్ లేక.. వేరే సీట్లో గెలిచారనీ,కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలుచేస్తే దేనికంటే దానికి రెడీ అని ఈటల ఛాలెంజ్ చేశారు.మల్కాజిగిరినీ నరేంద్రమోదీ గుండెల్లో పెట్టుకున్న నియోజకవర్గం అని, ఈ ప్రజల ప్రేమకు ముగ్ధులు అయ్యారని నాగర్ కర్నూల్, జగిత్యాలలో చెప్పారనీ తెలిపారు. ఈ ప్రేమతో జీవితం ధన్యం అయ్యింది అన్నారు.
బీజేపీ గెలిచే 400 స్థానాల్లో మల్కాజిగిరి కూడా ఒకటి ఉండబోతుంది అని ఆయన అన్నారు.
ప్రజల భాగస్వామ్యంతోనే మల్కాజిగిరి మోదీ రోడ్ షో విజయవంతం అయ్యిందనీ,కిలోమీటర్ల మేర రోడ్డుకి ఇరువైపుల నిలబడి స్వాగతం పలికారన్నారు.తెలంగాణ గడ్డ మీద ప్రజల సంఫీుభావం మోడీ మదిలో చిరస్థాయిగా నిలబడిరదనీ, కేవలం నార్త్ ఇండియాలోనే కాదు సౌత్ ఇండియాలో కూడా మోదీ ప్రభంజనం ఉంది అని నిరూపించారనీ రాజేందర్ అన్నారు.ఈసారి మాకు పార్టీ జెండా సిద్ధాంతం సంబంధంలేదు మావోటు మోదీకి, ఈటల రాజేందర్ కే అని ప్రజలు చెప్తున్నారనీ, మల్కాజ్గిరి పార్లమెంటు స్థానాన్ని భారీ మెజారిటీ తో మోదీకి కట్టబెట్టబోతున్నారనీ పేర్కొన్నారు.కనపడే మద్దతు కంటే కనపడని మద్దతు ఎక్కువ ఉందనీ,ప్రపంచదేశాలు కూడా మళ్ళీ మోదీనే ప్రధాని అవుతారని ప్రజలు నమ్ముతున్నారనీ తెలిపారు.ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన ప్రధాని మన నరేంద్ర మోదీ అని,మోదీ హయాంలో 12 కోట్ల టాయిలెట్స్ కట్టించారనీ తెలిపారు. మోదీ10 ఏళ్ల పాలనలో బాంబుల మోతలు లేవు.. తెగిపడ్డ శరీరాలు లేవనీ,పుల్వామా దాడి చేస్తే.. సర్జికల్ స్ట్రైక్ చేసి బదలా తీర్చుకున్నారనీ, ఇప్పుడు మేడ్ ఇన్ ఇండియా నినాదం కాదు విధానం అని తెలిపారు.డబ్బు, మద్యంకి పాతర వేయండినీ,ధర్మాన్ని గెలిపించండి అని కోరుతున్నాననీ ఈటల రాజేందర్ అన్నారు.