A place where you need to follow for what happening in world cup

సంగారెడ్డి జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం

0 28

ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలి మంటలు
మేనేజర్‌ రవి సహా మరో ఆరుగురు మృత్యువాత
సహాయక చర్యలు ముమ్మరం…రంగంలోకి దిగిన ఫైరింజన్లు

 జిల్లాలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్‌ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో బుధవారం రియాక్టర్‌ పేలి మంటలు భారీగా వ్యాపించాయి. ఈ అగ్ని ప్రమాదంలో పరిశ్రమ డైరెక్టర్‌ రవితో పాటు మరో ఆరుగురు కార్మికులు మృతి చెందారు. ఈ ప్రమాదంలో పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలికి చేరుకుని మంటలార్పేందుకు ప్రయత్నిస్తున్నారు. క్షతగాత్రులను సపంలోని హాస్పిటల్‌కి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఫ్యాక్టరీలో ఉన్న కార్మికులను బయటకు తీసుకురావడానికి తీవ్రంగా శ్రమిస్తున్నారు. సంగారెడ్డి జిల్లాలోని ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో బుధవారం సాయంత్రం భారీ అగ్నిప్రమాదం జరిగింది. హత్నూర మండలం చందాపూర్‌ వద్ద ఉన్న ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో రియాక్టర్‌ పేలడంతో మంటలు చెలరేగాయి.
ఈ అగ్ని ప్రమాదంలో ఎస్బీ పరిశ్రమలో మేనేజర్‌గా చేస్తున్న రవి మృతి చెందినట్లు సమాచారం. ఇప్పటివరకూ ఏడుగురు వ్యక్తులు చనిపోగా, మరో 10 మంది వరకు కార్మికులు తీవ్రంగా గాయపడ్డారు. మంటలు పక్కనున్న మరో పరిశ్రమకు వ్యాపించాయి. చుట్టుపక్కల వారిని సాధ్యమైనంత త్వరగా అక్కడి నుంచి ఖాలీ చేయిస్తున్నారు. పోలీసులు అక్కడికి చేరుకుని గాయపడిన వారిని, మృతదేహాలను సంగారెడ్డిలోని హాస్పిటల్‌కి తరలిస్తున్నారు. అగ్ని ప్రమాదం సమాచారం అందుకున్న సిబ్బంది ఫైర్నిజన్లతో అక్కడికి చేరుకుని మంటల్ని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో 50 మంది కంపెనీలోపల ఉన్నట్లు సమాచారం. పేలుడు ధాటికి మృతదేహాలు చెల్లాచెదురుగా పడిపోయి అక్కడ భయానక వాతావరణం కనిపిస్తోంది.
 తక్షణమే సహాయక చర్యలు చేపట్టండి…
 ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమ ప్రమాదంపై సమీక్షించిన ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి
 
image.png
సంగారెడ్డి జిల్లా హత్నూర మండలం చందాపూర్‌ సమీపంలోని ఎస్బీ ఆర్గానిక్స్‌ పరిశ్రమలో చోటు చేసుకున్న ప్రమాదంపై ముఖ్యమంత్రి ఏ. రేవంత్‌ రెడ్డి సమీక్షించారు. రియాక్టర్‌ పేలడంతో  మంటలు చెలరేగినట్లు అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. తక్షణమే సహాయక చర్యలు వేగవంతం చేసి, మంటలు అదువులోకి తీసుకురావాలని అగ్నిమాపక శాఖ అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. ప్రమాదంలో గాయపడిన వారికి  మెరుగైన వైద్య సహాయం అందజేయాలని ముఖ్యమంత్రి జిల్లా అధికారులకు సూచించారు. ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ముఖ్యమంత్రి ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు.

Leave A Reply

Your email address will not be published.