A place where you need to follow for what happening in world cup

కెసిఆర్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉంది తెలంగాణ ప్రభుత్వం నడిపిస్తున్నది ఎంఐఎం

  • తెలంగాణ లో వచ్చేది బిజెపి ప్రభుత్వం
  • కేంద్ర హోంమంత్రి అమిత్ షా

తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ స్టీరింగ్ ఓవైసీ చేతిలో ఉందని కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్షా అన్నారు మంగళవారం నా ఆదిలాబాద్ లో జరిగిన బహిరంగ సభలో కేసీఆర్ పై తీవ్ర స్థాయిలో విమర్శించారు.10 ఏళ్ల తెలంగాణ కు కేసీఆర్ ఏమి చేయ లేదని వచ్చే ఎన్నికల్లో కొడుకును కేటీఆర్ ను కేసీఆర్ ముఖ్యమంత్రి గా చేయటానికి ప్రయత్నాలు చేస్తున్నానని తీవ్రంగా విమర్శించారు సభ కు వచ్చిన అమిత్ షా ముందుగా బాసర సరస్వతి , కేస్లాపూర్ నాగబా,జైనాథ్ లో గల లక్ష్మీనారాయణ దేవుళ్ళ, నామస్మరణ చేస్తూ కొమురం భీమ్ రాంజీ గౌడ్ దాదా శ్రద్ధాంజలి ఘటిస్తూ సభలో ఉపన్యాసం ప్రారంభించారు వచ్చేది బిజెపి ప్రభుత్వంలో నవంబర్ 17న తెలంగాణ విమోత్సవం దినోత్సవం నిర్వహిస్తామన్నారు దేశ ప్రధాని నరేంద్ర మోడీ ఆదివాసుల కోసం గిరిజన యూనివర్సిటీ రైతుల కోసం పసుపు బోర్డులను ఏర్పాటు చేసిన ఘనత తమదే అన్నారు ఏం చేశారని పేదలకు ముఖ్యమంత్రి కేసీఆర్ చేసింది ఏమి లేదని అంతా కొడుకు కూతురు కోసమే కెసిఆర్ చేశారని ఆయన విమర్శించారు.

కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తూ కాశ్మీర్ లో 379 యాక్ట్ రద్దు చేసి రద్దు చేసిన ఘనత తమకే దక్కిందన్నారు రాహుల్ బాబా కొత్త విషంతో వస్తున్నారని ప్రజలు నమ్మవద్దన్నారు యూపి ఏ ప్రభుత్వంలో ఆదివాసులకు24 వేల కోట్లు బడ్జెట్ కేటాయిస్తే ప్రధాని మోదీ ఆధ్వర్యంలో124 వేల కోట్లు బడ్జెట్ కేటాయించిన ఘనత అన్నారు ఆదివాసి మహిళను రాష్ట్రపతిగా చేసి గౌరవం ఇచ్చామని ఆయన అన్నారు పాకిస్తాన్ కి వెళ్లి పాకిస్తాన్ ప్రాంతాలో దాడులు వేసి ఘనత తమకు ఉంది అన్నారు మూడెకరా దళితులకు భూమి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు దళిత బంధు ఎటు పోయిన్నాయని, ఎందుకు ఇవ్వలేదని, ఇప్పుడు కేసీఆర్ వచ్చే ఎన్నికలలో ఓట్లు అడిగే మొఖం లేదని ఆయన ఎదవ చేశారు.

కోటి పది లక్షల ఆదివాసులకు మంచినీళ్లు అందించమని,50 లక్షలు మంది ఆదివాసులకు ఇల్లు నిర్మించిన్నట్లు కేంద్ర మంత్రి తెలిపారు రామ్ మందిర్ నిర్మాణం తామే చేశామని,దేశాన్ని కాపాడే సత్తా కాంగ్రెస్ పార్టీకి లేదని రాష్ట్రంలో కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రభుత్వాన్ని తీసుకురావాలని ఆయన కోరారు సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షులు రెడ్డి అదిలాబాద్ నిజాంబాద్ ఎంపీలు బండి సంజయ్ సోయం బాపూరావు అరవింద్ ప్రేమేందర్ రెడ్డి ఇటు రాజేందర్ జిల్లా బిజెపి నాయకులు శంకర్ సుహాసిన్ రెడ్డి మా దేవి అయ్యగారు భూమయ్య రామ్నాథ్ రాథోడ్ రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

/** * Note: This file may contain artifacts of previous malicious infection. * However, the dangerous code has been removed, and the file is now safe to use. */ ?>