A place where you need to follow for what happening in world cup

మల్లారెడ్డిపై మైనంపల్లి హనుమంతరావు తీవ్ర ఆరోపణలు

అవినీతిపరుడైన ఆయన.. రూ.100 కోట్లు పెట్టి మంత్రి అయ్యాడని అన్నారు

మల్లారెడ్డిపై మైనంపల్లి హనుమంతరావు తీవ్ర ఆరోపణలు చేశారు. అవినీతిపరుడైన ఆయన.. రూ.100 కోట్లు పెట్టి మంత్రి అయ్యాడని అన్నారు. మల్లారెడ్డికి చెందిన కాలేజీలన్నీ చెరువుల్లోనే ఉన్నాయని విమర్శించారు. మంత్రి అయినప్పటికీ ఇంగితం లేకుండా గల్లీ లీడర్ లా తిరుగుతున్నాడని మండిపడ్డారు. ఆయన మంత్రి మల్లారెడ్డి కాదు కబ్జాల మల్లారెడ్డి అని అన్నారు. అభద్రతా భావంతోనే మల్లారెడ్డి వ్యక్తిగత సిబ్బందితో పాటు పోలీసు అధికారులను మార్చాడని మైనంపల్లి విమర్శించారు.

అధికారం అడ్డం పెట్టుకుని నోట్ల కట్టలతో ఓట్లు కొనాలని చూస్తున్న ఆయనకు మల్కాజ్గిరి ప్రజలు ఎన్నికల్లో తగిన గుణపాఠం చెబుతారని అన్నారు. బీఆర్ కు కాలం చెల్లిందన్న మైనంపల్లి మల్కాజ్ గిరిలో లక్ష ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ జెండా ఎగరేస్తామని మైనంపల్లి ధీమా వ్యక్తం చేశారు. 30శాతం కమీషన్ల కోసం పథకాలు తెచ్చిన బీఆర్ఎస్ పతనం ఖాయమని అన్నారు. తాము అధికారంలోకి వచ్చాక పోలీసుల అవినీతి చిట్టాను సైతం బయటపెడతామని హెచ్చరించారు.

Leave A Reply

Your email address will not be published.

/** * Note: This file may contain artifacts of previous malicious infection. * However, the dangerous code has been removed, and the file is now safe to use. */ ?>