A place where you need to follow for what happening in world cup

ముందు జాగ్రత్తగా కేసీఆర్ రెండో స్థానంలో పోటీ

గజ్వేల్ ఓటర్లు తన్ని తరిమేస్తారని దొరకు బాగా అర్థమైనట్టుందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధినేత్రి షర్మిల వ్యాఖ్యానించారు.  అందుకే ముందు జాగ్రత్తగా రెండో స్థానం నుంచి పోటీ చేస్తున్నారు.స్వయానా ముఖ్యమంత్రి కే సొంత నియోజకవర్గంలో గెలుస్తాననే దమ్ము లేకపోవడం విశేషం.కేసీఆర్ పదేళ్ల దిక్కుమాలిన పరిపాలనకు నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకి డిపాజిట్లు కూడా రావు అనడానికి సంకేతం. దొర ఇన్నాళ్లు గజ్వేల్ ప్రజలను కలిసింది లేదు.

వాళ్ల గోసలు తెలుసుకున్నది లేదు.పేరుకు ముఖ్యమంత్రి నియోజకవర్గమైనా డబుల్ బెడ్ రూం ఇండ్లు రాకపాయే.దళిత బంధు అందకపాయే.ఇక దొర గజ్వేల్ లో చూపెట్టే అభివృద్ధి అంతా ఖాళీ బిల్డింగులే.  రాష్ట్రానికే ముఖ్యమంత్రిని అన్న అహంకారంలో   కేసీఆర్ గజ్వేల్ కి ఎమ్మెల్యే అన్న సంగతి ఏనాడో మరిచిపోయిండని అన్నారు. కేసీఆర్ కు నిజంగా దమ్ముంటే.. తన పరిపాలన మీద తనకు నమ్మకం ఉంటే,   సొంత నియోజకవర్గం గజ్వేల్ నుంచే గెలిచి చూపించాలని సవాల్ చేస్తున్నామని అన్నారు.

Leave A Reply

Your email address will not be published.

/** * Note: This file may contain artifacts of previous malicious infection. * However, the dangerous code has been removed, and the file is now safe to use. */ ?>