A place where you need to follow for what happening in world cup

ఇద్దరిని మింగేసిన వర్షాలు

హైదరాబాద్ గాంధీనగర్‌ ఆనుకొని ఉన్న నాలాలో లక్ష్మీ నాలుగు రోజుల క్రితం లక్ష్మీ గల్లంతైంది. ఇంటి వెనకాల నాలాను ఆనుకొని ఉన్న బాత్రూమ్‌ గోడ కూలిపోవడంతో, నిచ్చెన సాయంతో ప్రతి రోజు వాష్‌రూమ్‌కు వెళ్లేవారు. ఆదివారం మధ్యాహ్నం నిచ్చెన సాయంతో నాలాలోకి వెళ్లిన లక్ష్మి గల్లంతైంది. ఘటన స్థలంలో ఆమె గాజులు పగిలిపోయి ఉండటంతో, నాలాలో పడిపోయి ఉండవచ్చని కుటుంబసభ్యులు, పోలీసులు భావించారు.  కుటుంబసభ్యుల ఫిర్యాదుతో మిస్సింగ్‌ కేసు నమోదు చేసిన పోలీసులు లక్ష్మీ కోసం నాలాలో గాలింపు చేపట్టారు.

ఇవాళ మూసీలో జేసీబీతో చెత్త క్లీన్‌ చేస్తుండగా.. మహిళ డెడ్‌బాడీ కనిపించింది. వెంటనే సిబ్బంది పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. అక్కడి నుంచి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ఇది తెలిసిన వెంటనే ఉరుకులు, పరుగుల మీద ముసారంబాగ్ చేరుకున్న కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరు అవుతున్నారు.
నగరంలో నాలా… ఏటా జనాల చావా.. బల్దియా నిర్లక్ష్యంతో నిండు ప్రాణాలు నాలాల్లో కలిసిపోతున్నాయి. వర్షం పడితే విశ్వ నగరంలో విషాద ఛాయలు అలముకుంటున్నాయి. ముంపు నివారణ చర్యలు నత్తనడక పడితే… ఏడాదికి ఒకరో ఇద్దరో అమాయకులు అసువులు బాస్తున్నారు. మాన్ సూన్ మాటెత్తితే నగర వాసుల్లో ముచ్చెమటలు పడుతున్నాయి . జాగో బల్దియా జాగో అని కామెంట్స్ పెడుతున్నారు నెటిజన్లు.

2023 సెప్టెంబర్ 3: గాంధీనగర్ కవాడి గూడ లో నాలాలో పడ్డ లక్ష్మి మృతి

2023 సెప్టెంబర్ 5: ప్రగతి నగర్ లో నాలాలో పడి నాలుగేళ్ల బాలుడు మిథున్ మృతి

2023 ఏప్రిల్ 29: సికింద్రాబాద్ కలాసిగుడలో నాలాలో పడి చిన్నారి మృతి

2022 సెప్టెంబర్: 11 మూసాపేట్ నాలాలో పడి రవి కూమార్ మృతి

2021 సెప్టెంబర్ 25 – కుత్బూల్లాపూర్ నాలాలో పడికొట్టుపోయి మోహన్ రెడ్డి మృతి

2021 సెప్టెంబర్ 24 – మణికొండలో పనులు జరుగుతున్న డ్రైనేజిలో పడి వ్యక్తి మృతి

2020 సెప్టెంబర్ 17- నేరేడడ్ మెట్ లో ప్రమాదవశాత్తు నాలాలో కొట్టుకపోయి చిన్నారి సుమేధ మృతి

2019 సెప్టెంబర్ 22- నిజాంపేట పుష్పక్ గృహ సమూదాయం వద్ద నాలాలో పడి కొట్టుకుపోయిన బిహార్‌వాసి రకిబుల్ షేక్ మృతి

ఇదీ వరస.. ఏటా నాలాలు తీస్తున్న ప్రాణాలు. నోళ్లు తెరుచుకున్న మ్యాన్ హోళ్లు అమాయకులు ప్రాణాలు మింగుతుంటే.. నాలాలు మృత్యు ప్రవాహాల్లా మారుతున్నాయి. వానాకాలం వస్తేనే వణికిపోతుంది భాగ్యనగరం. సోమవారం రాత్రి నుంచి మంగళవారం వరకు కురిసిన వర్షానికి నగరం ఆగమాగం అయింది. రోడ్లపై నదుల తలపించగా.. నాలాలు పొంగి కాలనీలను చుట్టుముట్టాయి. మలక్‌పేట్, మూసారాంబాగ్ మైసమ్మగూడ, టోలిచౌకి, మాదాపూర్, కృష్ణానగర్, యూసఫ్ గూడా ఇలా చాలా ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ప్రగతి నగర్ ఆడుకోవడానికి బయటకు వెళ్లిన నాలుగేళ్ల చిన్నారి నాళాలు పడి మృతి చెందడంతో నగరంలో విషాదఛాయలు అమ్ముకున్నాయి.

అంతకు ముందు మూడు రోజుల క్రితం సికింద్రాబాద్ గాంధీనగర్ పిఎస్ పరిధిలోని కవాడిగూడలో 55 ఏళ్ల మహిళ కాలుజారి హుస్సేన్ సాగర్ సర్ప్లస్ నాలాలో పడిపోయింది ఆమె డెడ్ బాడీ నాలుగు రోజుల తర్వాత మూసారాంబాగ్ బ్రిడ్జి వద్ద బుధవారం బయటపడింది. ఈ ఏడాది వేసవిలోనూ అకాల వర్షాల సమయంలో ఓ చిన్నారి పాల ప్యాకెట్ కోసం బయటకు వెళ్లి నాలాలో పడి మృతి చెందిన ఘటన మరవకముందే ఈ ఫోర్ డేస్ లో రెండు ఘటనలు నగరంలో కలవరం సృష్టించాయి. ఏప్రిల్ 29 న సికింద్రాబాద్ కళాసిగూడలో 9 ఏళ్ల చిన్నారి నాలాలో పడి మృతి చెందింది.మాన్ సూన్ ప్రిపరేషన్ వర్క్ స్ పూర్తి చేశామని అధికారులు చెబుతున్నా రెండు రోజుల వర్షానికి నగరం నరకయాతన చూసింది. డిసెంబర్ చివరి వారం లేదా జనవరి ప్రారంభం నుంచి నాలాల పూడిక తీత, నాలాల రిటైనింగ్ వాల్ నిర్మాణాలు, నాలాల ఆక్రమణల తొలగింపు, నాలాల సేప్టీ ఆడిట్, డ్రైన్ బాక్స్ ల నిర్మాణం, మ్యాన్ హోల్ మూతల పరిశీలన, ఓపెన్ నాలాల వద్ద భద్రత వంటి చర్యలు చేపట్టాలి. కానీ బల్దియా అధికారులు మాత్రం ఏదైనా ఘటన జరిగితే తప్ప మొద్దు నిద్ర వీడటం లేదు.

ఎండలు కాచే సమయంలో పని చేయాల్సి ఉన్నా చేయకుండా.. తీరా వానాకాలం స్టార్ట్ అయ్యాక పనులు మొదలు పెట్టే అధికారులతో ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందిస్ట్రాటజిక్ నాలా డెవలప్ మెంట్ ప్రొగ్రాం కింద మంత్రి కేటీఆర్ ఆదేశాలతో రెండేళ్ల నుంచి 57 పనులు ప్రారంభించారు. అందులో శివారు ప్రాంతాల్లో నాలా పనులు పూర్తి కావోస్తున్న నగరంలో మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. దాదాపు వెయ్యి కోట్లతో నాలా డెవలప్ మెంట్ వర్క్ జరుగుతున్న ఇందులో 35 జీహెచ్ఎంసీ పరిధి కాగా 22 పనులు శివారు మున్సిపాలిటీల్లో పనులు నడుస్తున్నాయి. సిటీలో మాత్రం 70 శాతం కూడా పనులు పూర్తి కాలేదు. ఇందుకు ప్రధాన కారణం నాలాలు ఆక్రమణలు తొలగించడం బల్దియాకు తలనొప్పిగా మారింది. కొన్ని ప్రాంతాల్లో కోర్టు కేసులతో నాలా పనులు పూర్తిగా ఆగిపోయాయి. నగరంలో వెయ్యికి పైగా ముంపు కాలనీలు ఉండగా.. శివారు ప్రాంతాలను కలుపుకుంటే అవి 2 వేలకు పైగానే. వీటి దగ్గర ముప్పు నివారణ చర్యలు చేపట్టాల్సి ఉండగా.. తాత్కాలిక ఉపశమన చర్యలు తప్పా శాశ్వత పరిష్కార మార్గాలు చూపిస్తున్నవి అరకొర మాత్రమే.

సిటీలో వాటర్ నిలిచే బ్లాక్ పాయింట్లు 257 ఉన్నాయి. అందులో ఖైరతాబాద్ మెట్రో స్టేషన్ కింద వంటి పాయింట్లలో నాలాలా వెడల్పు పనులు చేపట్టిన ఇంకా వందకు పైగా పాయింట్స్ లో పనులు చేయకపోవడంతో ఇంకా ముప్పు బెడద కొనసాగుతూనే ఉంది.జీహెచ్ఎంసీ, శివారు మున్సిపాలిటీ అధికారుల నిర్లక్ష్యంతో ఏడాది కి ఒకటి రెండు ప్రాణాలునాలాలకు బలవుతుంది. అయినా ఉన్నతాధికారుల చర్యలు మాత్రం అంతంతమాత్రమే. నాలా నాలా నువ్వెంత ప్రమాదం అంటే ప్రాణం తీసేంత అన్నట్లు సిటీలో పరిస్థితి తయారైంది. ఇకనైన బల్దియా నిర్లక్ష్యం వీడి మాన్ సూన్ ప్రిపేర్ నెస్ చర్యలు తీసుకోవాలనీ జనాలు కోరుతున్నారు. వరదలు వచ్చాక పని చేసేలా డీఆర్ఎఫ్ బృందాలను పెట్టారు కానీ వరద ముప్పు లేకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు మాత్రం మరిచారు. రెయినీ సీజన్ అంటేనే జనాలకు ముచ్చెమటలు పడుతున్నాయి.

Leave A Reply

Your email address will not be published.