- మండిపోతున్న టమాటా ధర
- గత కొన్ని రోజులుగా కిలో ధర రూ.100
- ఇప్పుడు రూ.150కి పైనే పలుకుతున్న టమాటా
- మధ్యప్రదేశ్ లో కిలో టమాటా రూ.160
దేశవ్యాప్తంగా టమాటా ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్యుడు టమాటాలు కొనే పరిస్థితి కనిపించడం లేదు. గత కొన్ని రోజులుగా కిలో రూ.100 పలికిన టమాటా, దేశంలోని పలు ప్రాంతాల్లో ఇప్పుడు రూ.150 కూడా దాటిపోయింది.
మధ్యప్రదేశ్ లోని రాయ్సెన్ జిల్లాలో కిలో టమాటా కొనాలంటే రూ.160 చెల్లించాల్సిందే. దేశంలోని మరి కొన్ని ప్రాంతాల్లో టమాటాలు కిలో ఒక్కింటికి రూ.120 నుంచి రూ.150 వరకు పలుకుతున్నాయి.
టమాటాల వినియోగం పెరగడం, వేసవి కారణంగా కొరత ఏర్పడడం వంటి కారణాలతో ధరలు మండిపోతున్నాయని అధికారులు చెబుతున్నారు.
అనేక రాష్ట్రాల్లో టమాటాలు తగ్గింపు ధరలతో ప్రజలకు అందించేందుకు ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నాయి. ఏపీలోని రైతు బజార్లలో కిలో రూ.50కే అందించాలని ప్రభుత్వం అధికారులను ఆదేశించడం తెలిసిందే.