మహబూబాబాద్:తొర్రూరు మున్సిపాలిటీ అభివృద్ధికి 25 కోట్లతో నిధులు మంజూరైన సందర్భంగా తొర్రూర్ బస్టాండ్ ముందు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ,మంత్రి కేటీఆర్ మరియు ఎర్రబెల్లి దయాకర్ రావు చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది .ఈ సందర్భంగా మండల అభివృద్ధి కమిటీ చైర్మన్ డాక్టర్ పొనుగోటి సోమేశ్వరరావు, మున్సిపల్ చైర్మన్ మంగలపల్లి రామచంద్రయ్య మాట్లాడుతూ గత మార్చి 8వ తారీఖున మహిళా దినోత్సవ సందర్భంగా రాష్ట్ర పురపాలక శాఖ మాత్యులు తారక రామారావు తొర్రూరు పట్టణ అభివృద్ధి కోసం 25 కోట్లతో ప్రత్యేక నిధులు మంజూరు చేస్తామని చెప్పి ఈరోజు మంజూరి ఆర్డర్ ఇచ్చినందుకు వారికి మరియు మా ప్రియతమ నాయకుడు రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయన్న కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
స్థానిక ఎమ్మెల్యే రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయన్న నాయకత్వంలో పాలకుర్తి నియోజకవర్గం అభివృద్ధి పథంలో నడుస్తుందని అన్నారు,గత కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో జరగన అభివృద్ధిని మా ఎర్రబెల్లి దయన్న ఊరు వాడ గల్లి నుండి పట్టణానికి ఇలా అనేక రంగాలలో అభివృద్ధి చేసి నిరూపించుకున్నారని అలాగే రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తిరుగులేని మెజారిటీతో ఎర్రబెల్లి దయన్నను గెలిపించుకుంటామని వారు అన్నారు ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ జినుగా సురేందర్ రెడ్డి కౌన్సిలర్లు ఎన్నమనేని శ్రీనివాసరావు, గుగులోత్ శంకర్ సీనియర్ నాయకులు దొంగరి శంకర్, పట్టణ పార్టీ ప్రధాన కార్యదర్శి కుర్ర శ్రీనివాస్, మండల గిరిజన సమన్వయ కమిటీ అధ్యక్షులు ధరావత్ జయసింగ్ ,బిజ్జాల అనిల్ ,కర్నే నాగరాజు ,తూర్పాటి రవి ,పేర్ల జంపా, ఎండి జలీల్, గుండాల నరసయ్య, చలవాది సత్యనారాయణ, రయిశెట్టి వెంకన్న, భూసాని ఉప్పలయ్య, బాలు నాయక్, కిన్నెర పాండు, రమేష్, స్వామి ,యశోద ,ఆశయ్య, శీను, మంగళంపల్లి వినయ్, దామోదర్ రెడ్డి , మంగళంపల్లి నాగరాజు ,రాజు, ముఖేష్, సురేందర్ తదితరులు పాల్గొన్నారు.