A place where you need to follow for what happening in world cup

సోనియా గాంధీతో సోనిపట్ మహిళా రైతుల డ్యాన్స్.. వీడియో ఇదిగో!

  • ఇటీవల హర్యానాలో రైతులతో కలిసి వరి నాట్లు వేసిన రాహుల్ గాంధీ
  • ఢిల్లీలో రాహుల్ ఇల్లు చూడాలని ఉందన్న మహిళా రైతులు
  • వాహనం ఏర్పాటు చేసి పిలిపించుకున్న కాంగ్రెస్ మాజీ చీఫ్
  • సోనియా గాంధీ, ప్రియాంక గాంధీలతో కలిసి లంచ్ చేసిన రైతులు

కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ సోనియా గాంధీని హర్యానాలోని సోనిపట్ చు చెందిన మహిళా రైతులు కలుసుకున్నారు. సోనియాతో పాటు ఆమె కూతురు ప్రియాంక గాంధీ, కొడుకు రాహుల్ గాంధీతో కలిసి భోజనం చేశారు. ఢిల్లీలోని సోనియా గాంధీ అధికారిక నివాసంలో సోనిపట్ మహిళా రైతులు సందడి చేశారు. అనంతరం సోనియాతో కలిసి డ్యాన్స్ చేశారు. ఈ వివరాలకు సంబంధించిన వీడియోను కాంగ్రెస్ పార్టీ తాజాగా ట్విట్టర్ లో రిలీజ్ చేసింది.

రాహుల్ గాంధీ ఇటీవల హిమాచల్ ప్రదేశ్ కు వెళుతూ హర్యానాలోని సోనిపట్ లో ఆగి రైతులను కలిసిన విషయం తెలిసిందే. మహిళా రైతులతో కలిసి వరి నాట్లు వేసిన రాహుల్.. వారితో చాలాసేపు ముచ్చటించారు. వారి కష్టసుఖాలతో పాటు కోరికలను తెలుసుకున్నారు. ఆ సందర్భంలో ఢిల్లీలోని రాహుల్ గాంధీ ఇంటిని చూడాలని ఉందంటూ మహిళా రైతులు తమ ఆకాంక్షను వ్యక్తం చేశారు. అయితే, తన ఇంటిని ప్రభుత్వం తీసేసుకుందని చెప్పిన రాహుల్.. తన తల్లి సోనియా గాంధీ ఇంటికి వారిని ఆహ్వానించారు.

ప్రత్యేక వాహనం ఏర్పాటు చేసి మహిళా రైతులను ఢిల్లీకి పిలిపించుకున్న రాహుల్ గాంధీ.. తన తల్లి సోనియా గాంధీ ఇంట్లో వారికి విందు ఇచ్చారు. సోనియా, ప్రియాంక, రాహుల్ లతో కలిసి మహిళా రైతులు భోజనం చేశారు. అనంతరం సోనియా గాంధీ ఇంటిని కలియతిరిగి చూశారు. బయట లాన్ లో డ్యాన్స్ చేసిన మహిళా రైతులు.. సోనియా గాంధీని తమతో కలుపుకున్నారు. మహిళా రైతుల ప్రయాణం మొత్తాన్ని వీడియో తీసి, దానిని పార్టీ ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయనున్నట్లు పార్టీ శ్రేణులు తెలిపాయి. ప్రస్తుతం ఈ వీడియోకు సంబంధించిన ట్రైలర్ ను రిలీజ్ పార్టీ రిలీజ్ చేసింది.

Leave A Reply

Your email address will not be published.