- నాలా కన్వర్షన్ కు 20 వేలు డిమాండ్
- 15 వేలు లంచం తీసుకుంటూ పట్టుబడ్డ వైనం
నాలా కన్వర్షన్ కు 20 వేలు లంచం డిమాండ్ చేసిన రెవెన్యూ ఇన్స్పెక్టర్ ఏసీబీ అధికారులు పన్నిన వలలో చిక్కాడు జగిత్యాల జిల్లా మెట్‌పల్లి మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ గా పనిచేస్తున్న తిరుపతి ని మంగళవారం ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు.
మండలంలోని మూడు బొమ్మల మేడిపల్లి కి చెందిన బద్దం శంకర్ అనే వ్యక్తి భూమి కి నాలా కన్వర్షన్ చేయాలని దరఖాస్తు చేసుకున్నాడు. రెవెన్యూ ఇన్స్పెక్టర్ తిరుపతి 20 వేలు డిమాండ్ చేయగా 15 వేలు లంచం ఇవ్వడానికి ఒప్పుకొని ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు దీంతో లంచం తీసుకుంటుండగా తిరుపతి తో పాటు మరో వ్యక్తిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.