బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం కొదురుపాక గ్రామం వద్ద కేడిసిసి బ్యాంకు ముందర ఆదివారం రోజున ఎదురెదురుగా బైక్ ఆటో ఢీ కొన్న సందర్భంలో ఒక వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందారు. ఒక వ్యక్తికి తీవ్ర గాయాలు పరిస్థితి విషమంగా ఉంది. స్థానికులు 108 సమాచారం ఇవ్వడంతో వారిని హాస్పిటల్ కి తరలించారు. సంఘటన స్థలానికి చేరుకొన్న పోలీస్ అధికారులు సమాచారం మేరకు మృతుడి ది హనుమకొండకు చెందిన వ్యక్తిగా తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.