తెలంగాణలోని నిరుద్యోగులకు ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ తెలిపింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తోన్న తెలంగాణ టీఆర్టీ నోటిఫికేషన్ ఎట్టకేలకు విడుదల అయ్యింది. మొత్తం 6,612 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిల్లో 5,059 ఉపాధ్యాయ పోస్టులుండగా.. స్పెషల్ ఎడ్యుకేషన్ స్కూళ్లలో 1523 పోస్టుల భర్తీకి ప్రకటన వెలువరించారు. ఈ మేరకు తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి నోటిఫికేషన్ విడుదల చేశారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలను ఖరారు చేస్తున్నామని మంద్రి సబితా తెలిపారు. ఇందుకు సంబంధించి మరో రెండు రోజుల్లో వివరణాత్మక నోటిఫికేషన్ విడుదల చేయనున్నారు. ఈ మేరకు మంత్రి సబితా హైదరాబాద్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నామని, నియామకాల విషయంలో ఇప్పటికే భారీ సంఖ్యలో నోటిఫికేషన్లు వచ్చాయని ఆమె వివరించారు.. ఈ మేరకు హైదరాబాద్‌లో ఆగస్టు 24 మంత్రి సబిత మీడియాతో మాట్లాడారు.
కార్పొరేట్ పాఠశాలల స్థాయిలో ప్రభుత్వ పాఠశాలలను తీర్చిదిద్దుతున్నట్లు వివరించారు. ఈసారి టీఎస్‌పీఎస్సీ ద్వారా కాకుండా డీఎస్సీ ద్వారానే పోస్టుల భర్తీ చేయనున్నట్లు మంత్రి సబితా తెలిపారు. దీనికి సంబంధించి రెండ్రోజుల్లోనే నోటిఫికేషన్, విధివిధానాలను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. రెండ్రోజుల్లోనే జిల్లా కలెక్టర్లు డీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేస్తారన్నారు. విద్యారంగంపై సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి పెట్టారని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ ఏడాది విద్యారంగానికి రూ.29,613 కోట్లు కేటాయించారని పేర్కొన్నారు. గురుకులాల్లో మనందరం గర్వపడేలా సత్ఫలితాలు వస్తున్నాయని మంత్రి సబిత అన్నారు. కొన్ని గురుకులాలను డిగ్రీ కాలేజీ స్థాయికి అప్‌గ్రేడ్ చేశామని తెలిపారు. గురుకులాల్లో 11,714 పోస్టుల భర్తీ ప్రక్రియ చేపట్టామని మంత్రి సబితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.
ఇప్పటికే 5,310 టీచర్ పోస్టులు భర్తీ చేశామని తెలిపారు. కాంట్రాక్టు ఉద్యోగులను ఇప్పటికే క్రమబద్ధీకరించామని చెప్పారు. అన్ని స్థాయిల విద్యాసంస్థల్లో మరిన్ని పోస్టులను భర్తీ చేస్తున్నామని మంత్రి తెలిపారు. ఇంటర్, డిగ్రీ స్థాయిల్లో 3,140 పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతుందని పేర్కొన్నారు. మిగిలిన ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టామన్నారు.దేశ వ్యాప్తంగా నెలకొన్న ఈసీఐఎల్ కేంద్రాల్లో ప్రాజెక్ట్ ఇంజినీర్, టెక్నికల్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రాజెక్ట్ ఇంజినీర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిద్వారా మొత్తం 163 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో డిప్లొమా, బీఈ, బీటెక్ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
న్యూఢిల్లీ ప్రధాన కేంద్రంగా పనిచేస్తున్న నార్తర్న్ రైల్వే కాంట్రాక్ట్ ప్రాతిపదికన వివిధ విభాగాల్లో సీనియర్ టెక్నికల్ అసోసియేట్ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇంజినీరింగ్ డిగ్రీ అర్హతతోపాటు గేట్ అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. సరైన అర్హతలున్నవారు ఆగస్టు 28 లోగా ఆన్‌లైన్ ద్వారా తమ దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది. అభ్యర్థులు దరఖాస్తు ఫీజుగా రూ.100 చెల్లించాలి. అయితే ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయించారు.అకడమిక్ మెరిట్, అర్హతల ఆధారంగా అభ్యర్థులను షార్ట్‌లిస్ట్ చేస్తారు. రూ.100. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది.