బెయిల్ తీర్పు మే 6కు వాయిదా
దేశవ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన దిల్లీ లిక్కర్ పాలసీ కేసులో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితకు మరోసారి నిరాశ ఎదురైంది. సీబీఐ కేసులో కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పును మే 6కి వాయిదా వేస్తూ రౌస్ అవెన్యూ కోర్టు ఆదేశాలు జారీ చేసింది.
ఈడీ, సీబీఐ రెండు కేసుల్లోనూ కవిత బెయిల్ పిటిషన్లపై తీర్పును మే 6న వెలువరిస్తామని జడ్జి కావేరి బవేజా గురువారం ప్రకటించారు. కాగా ఇదివరకే కవిత బెయిల్ పిటిషన్‌పై తీర్పు వాయిదా పడిరది. ఏప్రిల్ 22న తీర్పును కోర్టు రిజర్వ్ చేసింది. గురువారం జైలా లేదా బెయిలా అనేది తేలుతుందని అంతా భావించారు. కానీ కవితను నిరాశకు గురిచేస్తూ తీర్పును మరోసారి కోర్టు వాయిదా వేసింది.