జనగామ జూలై 20:రాష్ట్ర వ్యాప్తంగా కురుస్తున్న వర్షాలకు తెలంగాణ తడిసిముద్దయింది. చెరువులు, ప్రాజెక్ట్‌లు నిడుకుండలా మారాయి. ఎడతెరిపిలేకుండా కురుస్తున్న వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కాగా, జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు సోలమైల్ వద్ద జనగామ – సిద్దిపేట జాతీయ రహదారి కొట్టుకుపోయింది.
దీంతో జనగామ నుంచి సిద్దిపేట వెళ్లే ప్రయాణికులు బచ్చన్నపేట, కొడవటూరు వయా బండానాగారం, సలాకపురం మీదుగా ప్రయాణం సాగిస్తున్నారు. మరోవైపు అల్పపీడన ప్రభావంతో మరో నాలుగు రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అత్యవసరమైతే తప్ప బయటకు వెళ్లెద్దని అధికారులు సూచించారు.