దేశ రాజధాని ఢిల్లీలో ప్రారంభమైన జీ20 సమావేశాలు
దేశ రాజధాని ఢిల్లీలో జీ20 సమావేశాలుఇవాళ ప్రారంభం అయ్యాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ఈ సమావేశాల్లో పాల్గొన్నారు. భారత్ మండపంలో జరుగుతున్న కార్యక్రమానికి ఆయన తన టీమ్‌తో హాజరయ్యారు. ప్రధాని మోదీ ఆయనకు స్వాగతం పలికారు. భారత మండపంలో ఏర్పాటు చేసిన కోణార్క్ వీల్ వద్ద వివిధ దేశాధినేతలకు మోదీ షేక్ హ్యాండ్ ఇచ్చారు. బైడెన్ వచ్చిన సమయంలో కోణార్క్ వీల్ గురించి మోదీ వివరించారు. ఆ తర్వాత రౌండ్‌టేబుల్ సమావేశాలు ప్రారంభం అయ్యాయి. కోత్తగా జీ20లో సభ్యత్వం సాధించిన ఆఫ్రియా యూనియన్ అధినేతను ప్రధాని స్వాగతించారు. ఆయన్ను ఆలింగనం చేసుకుని కుర్చీలో కూర్చోపెట్టారు.
మరో వైపు ప్రధాని మోదీ కూర్చున్న కుర్చీ వద్ద టేబుల్‌పై ఉండే దేశం నేమ్‌ప్లేట్‌పై భారత్ అని రాసి ఉంది. గత కొన్ని రోజుల నుంచి దేశం పేరు మార్పు గురించి తీవ్ర స్థాయిలో చర్చ సాగుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు అంతర్జాతీయంగా భారత్‌ను ఇండియాగా గుర్తించే వారు. ఇప్పుడు తొలిసారి ఓ అంతర్జాతీయ సమావేశంలో ఇండియాను భారత్‌గా గుర్తిస్తూ.. రౌండ్‌టేబుల్‌పై దేశం నేమ్‌ప్లేట్‌ను ఏర్పాటు చేశారు. జీ20 ప్రతినిధులను ఉద్దేశిస్తూ ప్రధాని మోదీ ప్రసంగిస్తున్న చైర్ వద్ద ఉన్న నేమ్‌ప్లేట్‌లో భారత్ అని రాసి ఉంది. మోదీ తన ప్రసంగాన్ని ప్రారంభిస్తూ.. భారత్ మిమ్మల్ని స్వాగతిస్తోందన్నారు.