- కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరిని కలిసిన ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్
- తెలంగాణా రాష్ట్ర ప్రభుత్వ వైఖరి పై పిర్యాదు
న్యూ ఢిల్లీ ఆగష్టు 8:భారత ప్రభుత్వ కేంద్ర ఉపరితల రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరిని మంగళవారం ఉప్పల్ మాజీ శాసనసభ్యుడు ఎన్ వి ఎస్ ఎస్ ప్రభాకర్ ఢిల్లీలో ఆయన కార్యాలయంలో కలిశారు ఉప్పల్ ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణంలో జరుగుతున్నటువంటి జాప్యం వల్ల ఉప్పల్ ప్రజలు పడుతున్న పాట్లు ఇక్కట్లను గడికరి దృష్టికి తీసుకెళ్లారు రహదారి మరమ్మత్తుకు కేంద్రం నేరుగా రాష్ట్ర ప్రభుత్వానికి నిధులు ఇచ్చినా కూడా పనులు చేయడంలో కావాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తున్న విషయాన్ని వారి దృష్టికి తీసుకెళ్లారు . గాయత్రి కన్స్ట్రక్షన్స్ వల్ల అనేక రకాల ఇబ్బందులు ఎదురయ్యాయి అన్న విషయాన్ని కూడా తెలియజేశారు .
రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణలో భవన యజమానులకు నష్టపరిహారం మూడు రకాలుగా పరిహారము చెల్లించారని ఒకే ప్రాజెక్టు పరిధిలో ఈ రకమైన చెల్లింపుల అని కేంద్ర మంత్రి ఆశ్చర్యపోయారు.తెలంగాణ రాష్ట్రంలో కేంద్ర నిధులతో అనేక రోడ్ల నిర్మాణం పనులు వేగవంతంగా జరుగుతుంటే ఈ ఉప్పల్ కారిడార్ పనులకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తూ, జిహెచ్ఎంసి అధికారులు కూడా పైపులైన్లు ,ఎలక్ట్రిక్ స్తంభాలు, మార్చకుండా జాప్యం చేస్తున్నారు అని వివరించారు. కేంద్రమంత్రి ఈ విషయంపై స్పందిస్తూ ఈ పనులు వేగవంతంగా జరిగే విధంగా చీఫ్ ఇంజనీర్ జాతీయా రహదారులని తెలంగాణ ప్రభుత్వ అధికారులతో మాట్లాడి యుద్ధ ప్రాతిపదిక మీద పనులు జరిగే విధంగా చూడాలని ఆదేశించారు.