- మంథనిలో సీఎం కేసీఆర్ చిత్రపటానికి పాలాభిషేకాలు
- రుణమాఫీ పై బిఆర్ఎస్ నేతల సంబరాలు
మంథని:సీఎం కేసీఆర్ రైతుల పక్షపాతి అని రైతుల సంక్షేమం కొరకు అనేక పథకాలను అమలుపరిచి దేశ రైతులనే అబ్బరపరిచిన మహా ఘనుడు సీఎం కేసీఆర్ అని బిఆర్ఎస్ పార్టీ మంథని మండల అధ్యక్షుడు యెగోళపు శంకర్ గౌడ్ అన్నారు. రైతులకు లక్ష రూపాయల లోపు రుణాలను మాఫీ చేస్తున్నట్లు కేసిఆర్ చేసిన ప్రకటన నేపథ్యంలో గురువారం మంథని బిఆర్ఎస్ నేతలు పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తా వద్ద వేడుకలు జరుపుకున్నారు.టపాసులు పేల్చి సంబరాలు చేసుకున్నారు. వ్యవసాయ అభివృద్ధి సీఎం కేసీఆర్ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు.
ఎన్ని కష్టాలు వచ్చినా రైతులకు అమలుపరిచిన సంక్షేమ పథకాలను కొనసాగిస్తూ రైతులకు అండగా సీఎం కేసీఆర్ నిలిచారని గుర్తు చేశారు.కరోనా మహమ్మారితో ఆర్దిక సంక్షోభం ముళ్ళ కంపల చుట్టుముట్టిన వెనకడుగు వేయకుండా ఆ సమయాలలో రైతులను ఆదుకుంటూ రైతుల కష్టాలే నా కష్టం అంటూ అనుకున్న ఏకైక సీఎం కేసీఆర్ అని కొనియాడారు.ఇందుకుగాను రైతుల తరపున సీఎం కేసీఆర్, మంత్రి కొప్పుల ఈశ్వర్, పెద్దపల్లి జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.రైతులు వారికి ఎల్లవేళలా అండగా ఉండడంతో పాటు బిఆర్ఎస్ పార్టీ పక్షాన ఉంటూ పార్టీ పటిష్టతకు సహకరించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మంథని ఎంపీపీ కొండ శంకర్, సింగిల్ విండో చైర్మన్ కొత్త శ్రీనివాస్, మార్కెట్ కమిటీ చైర్మన్ ఎక్కేటి అనంతరెడ్డి, రైతుబంధు అధ్యక్షులు ఆకుల కిరణ్, కౌన్సిలర్లు వీకే రవి, కాయితి సమ్మయ్య, శ్రీపతి బానయ్య, బిఆర్ఎస్ పార్టీ నాయకులు తగరం శంకర్ లాల్, వేల్పుల గట్టయ్య, నక్క శంకర్, గొబ్బూరి వంశీ, ఎమ్మెస్ రెడ్డి, ఆకుల రాజబాపు, తాటి బుచ్చయ్య, కార్యకర్తలు,రైతులు తదితరులు పాల్గొన్నారు.