న్యూదిల్లీ, ఏప్రిల్ 15 : ఎలక్టోరల్ బాండ్స్‌పై సుప్రీమ్ కోర్టు రాజ్యాంగ ధర్మాసనం ఇచ్చిన తీర్పుని సవ్నిక్షించాలం టూ రివ్యూ పిటిషన్ దాఖలైంది. ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తుందన్న సుప్రీమ్ కోర్టు తీర్పుపై న్యాయవాది మాథ్యూస్ జె. నెడుంపర సోమవారం ఈ రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు.
నల్లధనాన్ని అడ్డుకునేందుకు ఆర్థిక చట్టంలోని సవరణలతో పార్లమెంటు ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని పిటిషన్‌లో తెలిపారు. ఈ పథకం నల్లధనాన్ని పూర్తిగా నిర్మూలించలేకపోయినప్పటికీ, దాతల విషయంలో గోప్యతను పాటించడం ద్వారా కొంత మేర పారదర్శకంగా ఉందని పేర్కొన్నారు.