హైదరాబాద్, ఆగస్టు 9:రాష్ట్రంలో మరో 5 కొత్త డిగ్రీ కాలేజీలు ఏర్పాటు కానున్నాయి. ఈ మేరకు తెలంగాణ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. ఉన్నత విద్యను బలోపేతం చేసే దిశగా తెలంగాణ సర్కార్ మరో నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో మరో 5 కొత్త ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను మంజూరు చేసింది. ఈ మేరకు సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది.
కొత్త డిగ్రీ కాలేజీలు:
మద్నూరు – కామారెడ్డి జిల్లా
ఆశ్వరావుపేట – భదాద్రి కొత్తగూడెం
ఇచ్చోడ – ఆదిలాబాద్
ఆమనగల్లు – రంగారెడ్డి జిల్లా
ఎల్లారెడ్డిపేట – సిరిసిల్ల జిల్లా
ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి జూన్ నెలలోనే కొత్తగా 17 బీసీ గురుకుల డిగ్రీ కళాశాలలు ఏర్పాటు చేసింది తెలంగాణ సర్కార్. ఫలితంగా రాష్ట్రంలో బీసీ గురుకుల డిగ్రీ కళాశాలల సంఖ్య 33కు చేరింది. ఈ నూతన డిగ్రీ కాలేజీలతో రాష్ట్రంలోని ప్రతీ జిల్లాలో బీసీ గురుకుల డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేసినట్లు అయింది. కొత్త బీసీ గురుకుల డిగ్రీ కాలేజీలను జోగులాంబ గద్వాల, నాగర్‌కర్నూల్, నారాయణపేట, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, ఆదిలాబాద్, కుమురంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, హనుమకొండ, భద్రాద్రి కొత్తగూడెం, సూర్యాపేట, యాదాద్రి భువనగిరి జిల్లాల్లో ఏర్పాటు చేశారు.
ఈ డిగ్రీ కాలేజీలతో 16వేలకుపైగా విద్యార్థులకు లబ్ది చేకూరనుంది. బీసీ డిగ్రీ కాలేజీల ఏర్పాటు ఇలా ఉండగానే… కొత్తగా మరో ఐదు డిగ్రీ కాలేజీలను మంజూరు చేసింది.గడిచిన మూడు విద్యా సంవత్సరాల్లో కొత్తగా 15 ప్రభుత్వ డిగ్రీ కాలేజీలను ప్రభుత్వం మంజూరు చేసింది. ఇందులో నల్గొండ జిల్లాలోని ఆలియా, మహేశ్వరం, వికారాబాద్, పరిగి, రాజేంద్రనగర్, కుత్బుల్లాపూర్, ధన్వాడ, మక్తల్, బడంగ్‌పేట్ ఉన్నాయి. ఒక్కో కాలేజీలో 240 సీట్లకు అనుమతినిచ్చారు .తెలంగాణ వైద్యవిధాన పరిషత్తు పరిధిలోని ఆస్పత్రుల్లో 3,124 పోస్టులు భర్తీ చేసేందుకు ఆర్థిక శాఖ మంగళవారం అనుమతులు ఇచ్చింది. ఈ ఉద్యోాలను ఏడాది కాలపరిమితితో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్, ఎంటీఎస్ పద్ధతిలో నియమించనున్నట్టు ఉత్తర్వుల్లో తెలిపింది. 968 పోస్టులు కాంట్రాక్ట్ పద్ధతిలో, 2029 పోస్టులు ఔట్ సోర్సింగ్ పద్ధతిలో, 127 పోస్టులను ఎంటీఎస్ పద్ధతిలో భర్తీ చేస్తారు.