A place where you need to follow for what happening in world cup

కేసీఆర్ రెండుచోట్ల, కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఓడిపోతున్నారు: కిషన్ రెడ్డి

  • నామినేషన్ ఉపసంహరించుకోవాలని కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారని విమర్శలు
  • గజ్వేల్‌లో 114 మంది బాధితులు, కామారెడ్డిలో 58 మంది బాధితులు నామినేషన్ వేశారన్న కిషన్ రెడ్డి
  • నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసులతో బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపణ
  • బీజేపీ బీసీలకు 39 టిక్కెట్లు ఇస్తే… కాంగ్రెస్ 22, బీఆర్ఎస్ 23 మందికే ఇచ్చాయన్న కిషన్ రెడ్డి

గజ్వేల్, కామారెడ్డి నియోజకవర్గాలలో నామినేషన్ ఉపసంహరించుకోవాలని నామినేషన్ దాఖలు చేసిన పలువురిని పోలీసుల ద్వారా బెదిరించారని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అన్నారు. ఓటమి భయంతో ముఖ్యమంత్రి కేసీఆర్ బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతున్నారన్నారు. పలుచోట్ల నామినేషన్లను ఉపసంహరించుకోవాలని ఇతర పార్టీల నేతలను, స్వతంత్ర అభ్యర్థులను బెదిరిస్తున్నారన్నారు. గజ్వేల్‌లో 114 మంది ధరణి బాధితులు, కామారెడ్డిలో 58 మంది బాధితులు నామినేషన్ దాఖలు చేశారని తెలిపారు. కానీ నామినేషన్లు ఉపసంహరించుకోవాలని పోలీసులతో బెదిరింపులకు పాల్పడ్డారన్నారు.

బీజేపీ తరఫున 39 మంది బీసీలు బరిలో ఉన్నారని, కానీ కాంగ్రెస్ నుంచి 22 మంది బీసీలు, బీఆర్ఎస్ నుంచి 23 మంది బీసీలు మాత్రమే పోటీ చేస్తున్నారన్నారు. బీసీల గురించి ఆలోచించేది కేవలం బీజేపీ మాత్రమే అన్నారు. అందుకే కేసీఆర్ గజ్వేల్ నుంచి కామారెడ్డికి పారిపోయారన్నారు. కేసీఆర్ రెండుచోట్లా ఓడిపోవడం ఖాయమన్నారు. కేసీఆర్‌తో పాటు కేటీఆర్ సిరిసిల్ల నుంచి ఓడిపోతున్నారన్నారు. కేసీఆర్‌ను కామారెడ్డిలో గెలిపించాలని కాంగ్రెస్ కుట్ర చేస్తోందని, ప్రభుత్వ వ్యతిరేక ఓటును చీల్చి గెలిపించాలని చూస్తోందని మండిపడ్డారు.

Leave A Reply

Your email address will not be published.